బిల్లులు రాక రెండేళ్లు.. | Sakshi
Sakshi News home page

బిల్లులు రాక రెండేళ్లు..

Published Tue, May 7 2024 4:35 AM

బిల్లులు రాక రెండేళ్లు..

కొత్తగూడెంటౌన్‌: అంగన్‌వాడీ కేంద్రాలకు రెండేళ్లుగా ఈవెంట్‌ బిల్లులు, నాలుగేళ్లుగా స్టేషనరీ బిల్లులు రావడం లేదు. దీంతో చేతి నుంచి ఖర్చు పెట్టిన టీచర్లు ఎదరుచూస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారంపై అంగన్‌వాడీ కేంద్రాల్లో అవగాహన తదితర కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇందుకోసం నెలకు రూ.200 నుంచి రూ.400 వందల వరకు ఖర్చు అవుతుంది. స్టేషనరీకి మరో రూ.100 వరకు ఖర్చవుతాయి. జిల్లాలోని 2,060 అంగన్‌వా డీ కేంద్రాల్లో వీటి కోసం తొలుత టీచర్లు ఖర్చు చేసి, అనంతరం బిల్లులు పెట్టుకుంటారు. గత రెండేళ్లుగా ఈవెంట్లు, స్టేషనరీ ఖర్చులకు సంబంధించిన బిల్లులను ప్రభుత్వం విడుదల చేయడంలేదని అంగన్‌వాడీ టీచర్లు వాపోతున్నారు. ముందుగా మేము చెల్లించి తర్వాత బిల్లులు పెట్టుకున్నా ఏళ్ల తరబడి మంజూరు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పెండింగ్‌ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

త్వరలోనే చెల్లిస్తాం

అంగన్‌వాడీ కేంద్రాల పెండింగ్‌ బిల్లుల సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఎంత మొత్తం చెల్లించాలనే వివరాలతో నివేదికలు కూడా పంపించడం జరిగింది. బడ్జెట్‌ కేటాయింపులు జరగగానే త్వరలోనే పెండింగ్‌ స్టేషనరీ, ఈవెంట్‌ బిల్లులు అన్నీ చెల్లిస్తాం. టీచర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

–సలోమి, సీడీపీఓ, కొత్తగూడెం

పెండింగ్‌లో స్టేషనరీ, ఈవెంట్‌ చెల్లింపులు

ఒక్కో కేంద్రంలో నెలకు రూ.300 నుంచి రూ. 500 ఖర్చు

ఎదురుచూస్తున్న 2,060 మంది అంగన్‌వాడీ టీచర్లు

Advertisement
 
Advertisement