విద్యతోనే గౌరవం, గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

విద్యతోనే గౌరవం, గుర్తింపు

Published Wed, Jan 29 2025 12:51 AM | Last Updated on Wed, Jan 29 2025 12:51 AM

విద్యతోనే గౌరవం, గుర్తింపు

విద్యతోనే గౌరవం, గుర్తింపు

భద్రాచలంటౌన్‌ : సరైన చదువు ఉంటేనే సమాజంలో గౌరవం, గుర్తింపు దక్కుతాయని టీజేఎస్‌ వ్యవస్థాపకులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. భద్రాచలంలోని గిరిజన బీఈడీ కళాశాలను మంగళవారం ఆయన సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. గిరిజన బిడ్డలు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. దేశంలోనే ఏకై క గిరిజన బీఈడీ కళాశాల భద్రాచలంలో ఉండడం హర్షణీయమని అన్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఏడు లక్షల మంది భారతీయులను వెనక్కు పంపేందుకు అక్కడి ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని, తద్వారా ఆ దేశ యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించేలా చూస్తోందని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ వీరూనాయక్‌, అధ్యాపకులు నవీన్‌, కిషోర్‌, టీజేఎస్‌ నాయకులు తిప్పన సిద్ధులు, రేపాక రామారావు గుప్తా, పూనెం ప్రదీప్‌ కుమార్‌, బి.దేవదానం, నాగిరెడ్డి, కరుణాకర్‌ రెడ్డి, నబి సాహెబ్‌, ఆంజనేయులు పాల్గొన్నారు.

రహదారి విస్తరణకు కృషి

బూర్గంపాడు : సారపాక నుంచి ఏటూరునాగారం వరకు గల రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నందున వాటి నివారణకు ఈ రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించేలా ప్రభుత్వంతో మాట్లాడి నిధుల మంజూరుకు కృషి చేస్తానని కోదండరామ్‌ తెలిపారు. సారపాకలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలయ్యేలా సహకరిస్తామని చెప్పారు. సాదాబైనామా, పోడు భూములకు పట్టాలు అందించాలని సంబంధిత మంత్రికి వినతిపత్రం అందిస్తామన్నారు. ఐదు విలీన పంచాయతీలను తిరిగి భద్రాచలంలో కలిపేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడామని తెలిపారు. ఐటీసీ గుర్తింపు ఎన్నికల్లో ఐఎన్‌టీయూసీకి మద్దతు ప్రకటించారు. ఆయన వెంట ఐఎన్‌టీయూసీ నాయకులు మారం వెంకటేశ్‌రెడ్డి, టీజేఎస్‌ జిల్లా అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు మూల నాగిరెడ్డి ఉన్నారు.

రామయ్యను దర్శించుకున్న ప్రొఫెసర్‌..

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని కోదండరామ్‌ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆధికారులు స్వామివారి ప్రసాదం, జ్ఞాపిక అందజేశారు.

ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కోదండరామ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement