‘సంక్షేమ’ పరిశీలన పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

‘సంక్షేమ’ పరిశీలన పూర్తి చేయాలి

Published Thu, Jan 30 2025 12:53 AM | Last Updated on Thu, Jan 30 2025 12:53 AM

‘సంక్షేమ’ పరిశీలన పూర్తి చేయాలి

‘సంక్షేమ’ పరిశీలన పూర్తి చేయాలి

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల దరఖాస్తుల పరిశీలన త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ విద్యాచందనతో కలిసి ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, సంబంధిత అధికారులతో కలిసి సంక్షేమ పథకాల అమలు, పీఎం కుసుమ్‌ పథకం, వేసవిలో నీటికొరత రాకుండా తీసుకోవాల్సి చర్యలు, ప్లాంటేషన్‌పై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న సంక్షేమ పథకాల దరఖాస్తులను గురువారంలోగా ఆన్‌లైన్‌ చేయాలన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో కొత్తగా వచ్చిన 3,403 దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఈ నెల 31వ తేదీ లోపు నివేదిక అందించాలన్నారు. బ్యాంకు అకౌంట్‌ నంబర్ల నమోదులో తప్పులను సరిచేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌ కార్డుల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్దేశిత పట్టిక ద్వారా వివరాలను అందించాలని ఆదేశించారు. పీఎం కుసుమ్‌ పథకం అమలులో భాగంగా సబ్‌స్టేషన్‌కు 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించాలన్నారు. సోలార్‌ పవర్‌ప్లాంట్ల ఏర్పాటుకు నాలుగు ఎకరాల భూమి అవసరం ఉంటుందని, మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ ప్లాంట్‌ స్థాపన చేస్తే 90 శాతం సబ్సిడీ వస్తుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం పవర్‌ ప్లాంట్ల స్థాపనకు జిల్లాకు 150 ఎకరాలు లక్ష్యంగా ఇచ్చిందని తెలిపారు. వేసవి నీటి కొరత నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. హరితహారం లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డీపీఓ చంద్రమౌళి, హౌసింగ్‌ పీడీ శంకర్‌, ఇండస్ట్రీస్‌ జీఎం తిరుపతయ్య, ఎల్‌బీఎం రామిరెడ్డి, డీఈఓ వెంకటేశ్వరాచారి, సెర్ప్‌ పీడీ నీలేష్‌, అడిషనల్‌ డీఆర్‌డీఓ రవి తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement