ఎడ్ల బండ్లతో ఎమ్మెల్యే ప్రదర్శన
ఇల్లెందు: రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలతో రాష్ట్ర ప్రభుత్వం రైతులు, వ్యవసాయ కూలీల కుటుంబాల్లో వెలుగులు నింపిందని ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. రెండు రోజులుగా ఈ నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమవుతున్న నేపథ్యంలో మంగళవారం ఆయన ఇల్లెందులో ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం స్థానిక బగదాంబా సెంటర్లో సీఎం చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మొదటి విడతలో తమకు లబ్ధి జరగలేదని ఎవరూ ఆందోళన చెందొద్దని, అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. పథకాల అమలులో అర్హులైన పేదలకు అన్యాయం జరగకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బానోతు రాంబాబు, మాజీ ఎంపీపీ మోకాళ్ల వెంకటమ్మ, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు డానియేల్, పులి సైదులు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ యదళ్లపల్లి అనసూర్య, ముక్తి కృష్ణ, తాటి భిక్షం, ఎట్టి హరికృష్ణ, ఆరెం కిరణ్, మండల రాము, భార్గవ్, గూడ బాబూరావు, కల్తీ పద్మ, సాయం స్వాతి తదితరులు పాల్గొన్నారు.
హామీల అమలు కాంగ్రెస్‌కే సాధ్యం..
టేకులపల్లి: ఇచ్చిన హామీలను అమలు చేసే సత్తా కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. మంగళవారం ఆయన స్థానిక క్యాంప్ కార్యాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేశారు. రైతులకు స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు కోరం సురేందర్, భూక్య దేవా, ఇస్లావత్ రెడ్యానాయక్, ఈది గణేష్, చందర్‌సింగ్, పోశాలు, సర్దార్, బానోత్ రవి, భద్రు, ఈశ్వర్, గణేష్, మంగీలాల్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం చిత్రపటానికి కోరం క్షీరాభిషేకం
Comments
Please login to add a commentAdd a comment