నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గా వించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
పెద్దమ్మతల్లికి
సువర్ణ పుష్పార్చన
పాల్వంచ: మండల పరిధిలో కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి అర్చకులు గురువారం 108 సువర్ణ పుష్పాలతో వైభవంగా అర్చన నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి హార తి, మంత్ర పుష్పం, నివేదన సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎన్.రజనీ కుమారి తదితరులు పాల్గొన్నారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
పీహెచ్‌సీని సందర్శించిన కేంద్ర బృందం
ములకలపల్లి : మండల కేంద్రంలోని మంగపేట గిరిజన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కేంద్ర బృందం (పాపులేషన్ రీసెర్చ్ టీం) గురువారం సందర్శించింది. ఈ సందర్భంగా పీహెచ్‌సీలో వైద్య సేవల వివరాలను బృందం సభ్యులు డాక్టర్ మురుగేషన్, డాక్టర్ సెంథిల్ అడిగి తెలుసుకున్నారు. నేషనల్ హెల్త్ మిషన్(ఎన్‌హెచ్‌ఎం)లో భాగంగా జనాభా ప్రాతిపకదిన పీహెచ్‌సీకి రావాల్సిన మందులు, అందిస్తున్న వైద్యం వంటి అంశాలను పరిశీలించారు. రికార్డులను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మూకమామిడి హెల్త్ సబ్‌సెంటర్ తనిఖీ చేశారు. కార్యక్రమంలో వైద్యాధికారులు సాయికల్యాణ్, కృష్ణదీపక్ రెడ్డి, డాక్టర్ మధువరణ్, ఎన్‌హెచ్‌ఎం అకౌంట్స్ అధికారి భాను, సీతమ్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment