వేగంగా ఏర్పాట్లు
● చక చకా పురపాలక పనులు ● ఆస్తుల వివరాల సేకరణలో అధికారులు
అశ్వారావుపేట: అశ్వారావుపేట మున్సిపాలిటీకి సంబంధించిన పనులు చక చకా సాగుతున్నాయి. అశ్వారావుపేట, గుర్రాలచెరువు, పేరాయిగూడెం గ్రామపంచాయతీలను కలుపుతూ అశ్వారావుపేట మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇన్చార్జ్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన సుజాత గ్రామపంచాయతీల కీలక రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఇతర ఆస్తుల వివరాలు సేకరించాలని సిబ్బందికి సూచించారు. మున్సిపల్ కార్యాలయానికి బోర్డు ఏర్పాటు చేశారు. గ్రామపంచాయతీల స్థిర, చరాస్తుల వివరాలను జీపీ కార్యదర్శులు నమోదు చేస్తున్నారు.
జాబ్‌కార్డులు రద్దు
మున్సిపాలిటీ పరిధిలో ఉపాధి హామీ పనులు ఉండనందున ప్రస్తుతం ఉన్న 3,741 జాబ్‌కార్డులు ఇకపై రద్దు కానున్నాయి. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద లబ్ధి పొందాలంటే జాబ్కార్డులే ఆధారం. భూమి లేకుండా, 2024లో కనీసం 20 రోజులు ఉపాధి పని చేసిన వారినే అర్హులుగా గుర్తిస్తున్నారు. అయితే ఇప్పడు మున్సిపాలిటీలోకి బదలాయించిన జాబ్‌కార్డుదారులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వర్తిస్తుందా.. లేదా అనేది అధికారులకూ స్పష్టత లేదని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment