రోడ్డు భద్రతే ప్రధానం
ఖమ్మంయూరిసెంటర్: ప్రతీ వాహన డ్రైవర్ రోడ్డు భద్రతా నియమావళిని పాటించడం ద్వారా ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని ఖమ్మం జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటరమణ, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ సూచించారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు సందర్భంగా గురువారం ఖమ్మం కొత్త బస్టాండ్‌లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. వాహన వేగాన్ని అదుపులో ఉంచాలని, తద్వారా సురక్షిత ప్రయాణం సాధ్యమవుతుందని తెలిపారు. ఆర్టీసీ ఖమ్మం రీజినల్ మేనేజర్ ఏ.సరిరామ్ మాట్లాడుతూ ఆర్టీసీ డ్రైవర్లు ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. అనంతరం ప్రమాద రహితంగా బస్సులు నడిపిన డ్రైవర్లను సన్మానించారు. ఖమ్మం రీజియన్‌లో మొదటి స్థానం ఖమ్మం డిపోనకు చెందిన బి.రాములు దక్కించుకోగా, ఆ తర్వాత స్థానాల్లో డి.ఆంఽథోని(ఖమ్మం), వి.వెంకటేశ్వర్లు(మణుగూరు) నిలిచారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజనల్ మేనేజర్ జీ.ఎన్.పవిత్ర, ఖమ్మం డీఎం దినేష్‌కుమార్ పాల్గొన్నారు.
ఉత్తమ ఆర్టీసీ డ్రైవర్ల సన్మానంలో అధికారులు
Comments
Please login to add a commentAdd a comment