ఎన్నికల నియమావళి అమలు చేయండి
అధికారులకు కలెక్టర్ ఆదేశం
సూపర్‌బజార్(కొత్తగూడెం): ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ను జిల్లాలో పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందనతో పాటు పలువురు అధికారులతో గురువారం ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం బుధవారమే ఎమెల్సీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో కోడ్ అమల్లోకి వచ్చిందని తెలిపారు. వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయ ఎన్నిక ఫిబ్రవరి 27న జరుగుతుందని, మార్చి 3న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుందని చెప్పారు. అప్పటివరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో రాజకీయ నాయకుల ఫొటోలు, ప్రకటనలు, పోస్టర్లు, బ్యానర్లు తొలగించాలని, బస్టాండ్, పబ్లిక్ పార్కు వంటి ప్రాంతాల్లో ఉన్న హోర్డింగులు, బ్యానర్లు, స్టిక్కర్లు తొలగించాలని ఆదేశించారు. ప్రజలను ప్రభావితం చేసేలా గోడలపై ఉన్న రాతలను చెరిపివేయాలని, దేశ, రాష్ట్ర, స్థానిక రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేయాలని చెప్పారు.
గాంధీజీకి ఘన నివాళి
జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని గురువారం కలెక్టరేట్లో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జితేష్ వి పాటిల్, అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందన తదితరులు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment