సమస్యల పరిష్కారానికి కార్యాచరణ
సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి జేఏసీ ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రారంభిస్తామని ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ అన్నారు. స్థానిక కొత్తగూడెం క్లబ్‌లో టీఎన్‌జీఓస్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని ఇరిగేషన్ శాఖలో ఏజెన్సీ అలవెన్స్ నిలిపి వేశారని, పునరుద్ధరించాలని కోరారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్నందున ఆ తర్వాత ముఖ్యమంత్రితో సమావేశం కానున్నట్లు తెలిపారు. అప్పటికీ సమస్యలు పరిష్కరించబడకపోతే ఉద్యమ కార్యాచరణ ప్రారంభిస్తామని ప్రకటించారు. జేఏసీ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రస్తుతం అన్ని శాఖల్లో ఖాళీలను డీపీసీ ద్వారా భర్తీ చేయాలని కోరారు. అనంతరం యూనియన్ డైరీని సంఘం నాయకులు ఆవిష్కరించారు. సమావేశంలో టీఎన్‌జీఓ రాష్ట్ర సహ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు, టీజీఓ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, టీజీఓ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెంకటపుల్ల య్య, మహేష్, టీఎన్‌జీఓ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రామారావు, భార్గవ్ చైతన్య, ఎంపీఓ రాష్ట్ర అధ్యక్షుడు శేషాంజన్, నాయకులు డి.పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్
Comments
Please login to add a commentAdd a comment