
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో స్వామివారి మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన పూజలు చేశారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు.
రామాలయానికి రూ.5,02,116 విరాళం
అశ్వాపురం: మండల పరిధిలోని మొండికుంట గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి మిట్టకంటి రామిరెడ్డి–చంద్రకళ దంపతుల కూతురు, అల్లుడు సామ శ్రీ హర్షిత–శ్రీకాంత్‌రెడ్డి శని వారం రూ.5,02,116 విరాళం అందజేశారు. ఖండాలు దాటినా పుట్టిన ఊరుపై మమకారంతో భారీ విరాళం అందజేసిన హర్షిత–శ్రీకాంత్‌రెడ్డి దంపతులను గ్రామస్తులు అభినందించారు. మిట్టకంటి రామిరెడ్డి ఉపాధ్యాయుడిగా గ్రామంలో ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పారని పేర్కొన్నారు. బూర్గంపాడు మాజీ జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, రామకొండారెడ్డి దంపతులు రూ. 10 వేలు, ఎస్‌కేటీ గ్రూప్ అధినేత దోసపాటి పిచ్చేశ్వరరావు రూ.25,116 విరాళం అందజేశారు.
‘పర్ణశాల’ ముఖద్వారానికి ఇత్తడి తొడుగు
దుమ్ముగూడెం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన పర్ణశాల శ్రీ సీతారామ చంద్రస్వామివారి ఆలయ ము ఖ ద్వారానికి హైదరాబాద్ వాసి మహాలక్ష్మి ఇత్తడి కవచం వితరణ చేశారు. సుమా రు రూ.3 లక్షల వ్యయంతో ముఖ మండప ద్వారం, తలుపులతో సహా ఇత్తడి తొడుగు చేయించారు. ఈ తొడుగులను హైదరాబాద్‌కు చెందిన రాఘవ తయారుచేశారు. ఈఓ రమాదేవి, అనిల్‌కుమార్ పాల్గొన్నారు.
వ్యవసాయ క్షేత్రంలో
మంత్రి తుమ్మల
దమ్మపేట : మండల పరిధిలోని అప్పారావుపేట గ్రామ శివారులో ఉన్న సొంత వ్యవసాయ క్షేత్రాన్ని శనివారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు. క్షేత్రంలో సాగు చేస్తున్న క్యాబేజీ, కాలీఫ్లవర్, టమాట, సొరకాయ తదితర పంటలను పరిశీలించి కోయించారు. తుమ్మలతోపాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు కాసాని నాగప్రసాద్, తుమ్మల శేషుబాబు, ఎర్రా వసంతరావు తదితరులు ఉన్నారు.
రేపటి నుంచి
రెండో విడత టెండర్లు
● తొలివిడతలో తునికాకు సేకరణకు
రెండు యూనిట్లలోనే ఖరారు
పాల్వంచరూరల్ : ఈ నెల 10, 11 తేదీల్లో రెండో విడత తునికాకు టెండర్ల ప్రక్రియ నిర్వహించనున్నారు. ఈసారి తునికాకు టెండర్ల ప్రక్రియలో జాప్యం జరిగింది. దీంతో కాంట్రాక్టర్లు ఆసక్తి చూపడంలేదు. ఏజెన్సీలో ఏటా రెండు నెలలపాటు గిరిజనులు, గిరిజనేతరులకు ఉపాధి కల్పించే తునికాకు సేకరణకు ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆన్‌లైన్‌లో టెండర్లు నిర్వహిస్తోంది. ఈ సీజన్‌లో మొదటి విడతగా గత నెల 27, 28 తేదీల్లో టెండర్ల ప్రక్రియ నిర్వహించారు. జిల్లాలోని ఆరు డివిజన్ల పరిధిలో 59 యూనిట్‌లు ఉండగా, కేవలం చర్ల, దుమ్ముగూడెం రేంజ్‌లోని రెండు యూనిట్లలో మాత్రమే తునికాకు సేకరణకు టెండర్లు ఖరారయ్యాయని డీఎఫ్‌ఓ జి.కృష్ణాగౌడ్ తెలిపారు. ఇంకా 57 యూనిట్లకు టెండర్లు ఖరారు కావాల్సి ఉండగా, రేపటి నుంచి రెండో విడత, ఈ నెల 20, 21 తేదీల్లో మూడో విడత టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తామని పేర్కొన్నారు.

రామయ్యకు సువర్ణ తులసీ అర్చన

రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
Comments
Please login to add a commentAdd a comment