
మంచి నడవడిక నేర్పాలి
సింగరేణి(కొత్తగూడెం): సృష్టిలో అందరికీ మొదటి గురువు అమ్మేనని, పిల్లలకు మంచినడవడిక నేర్పితే వారు మహిళల పట్ల గౌరవంగా ఉంటారని జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి భానుమతి అన్నారు. శనివారం కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మహిళలు ధైర్య సాహసాలతో విపత్తులను ఎదుర్కోవాలని, మహిళా సాధికారతకు కృషి చేయాలని అన్నారు. ప్రస్తుతం మహిళలు అంతరిక్ష రంగం నుంచి భూగర్భ గనుల వరకు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. విశిష్ట అతిథిగా హరిణీ సత్యనారాయణరావు హాజరయ్యారు.
అన్ని రంగాల్లో రాణించాలి
మహిళలు పురుషులకు దీటుగా అన్ని రంగాల్లో రాణించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన పేర్కొన్నారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సింగరేణి కొత్తగూడెం ఏరియా రుద్రంపూర్‌లోని ఆర్‌సీఓఏ క్లబ్‌లో సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఆమె మాట్లాడారు. మహిళలు వేగవంతంగా పురోగతి సాధించాలని చెప్పారు. అనంతరం అదనపు కలెక్టర్‌తోపాటు ఎఫ్‌డీఓ శాతంపురి సుజాత, భద్రాచలానికి చెందిన డాక్టర్ కట్ట సాగరికను సన్మానించారు. ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇటీవల నిర్వహించిన ఆటల పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సేవా ఇన్‌చార్జి అధ్యక్షురాలు పద్మజా కోటిరెడ్డి పాల్గొన్నారు.
జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి భానుమతి
Comments
Please login to add a commentAdd a comment