
జాతీయ లోక్ అదాలత్‌కు విశేష స్పందన
కొత్తగూడెంటౌన్: జిల్లావ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌కు విశేష స్పందన లభించింది. దాదాపు 4,997 కేసులకు పరిష్కారం లభించింది. కొత్తగూడెంలో సివిల్ కేసులు 11, క్రిమినల్ కేసులు 3,174, పీఎల్‌సీ కేసులు 310 కేసులు మొత్తం 3495 కేసులను పరిష్కరించారు. ఇల్లెందులో సివిల్ కేసులు 6, క్రిమినల్ కేసులు 278, పీఎల్‌సీ కేసులు 138 మొత్తం 422 కేసులు పరిష్కారమయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ మాట్లాడుతూ అదాలత్‌లో కక్షిదారులు సమస్యలను పరిష్కరించుకోవడం అభినందనీయమని అన్నారు. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడంతో కుటుంబ కలహాలు పెరిగాయని, చిన్నచిన్న గొడవలు, క్షణికావేశంలో చేసిన నేరాలతో కోర్టుల చుట్టూ తిరుగుతూ విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని అన్నారు. రాజీమార్గమే రాజమార్గమని, రాజీ ద్వారా సమయం, డబ్బులను ఆదా చేసుకోవచ్చని చెప్పారు. కక్షిదారులకు యూనియన్ బ్యాంకు, ఎస్బీఐ ఆధ్వర్యంలో పులిహోర పంపిణీ చేశారు. తాగునీటి సౌకర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి. భానుమతి, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్‌జడ్జి బత్తుల రామారావు, రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె.సాయిశ్రీ, కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు తోట మల్లేశ్వరావు, ప్రధాన కార్యదర్శి ఎం.ఎస్.ఆర్ రవిచంద్ర, మహ్మద్ సాధిక్‌పాషా, వి.పురుషోత్తమరావు, పి. నిరంజన్‌రావు పాల్గొన్నారు.
జిల్లావ్యాప్తంగా 4,997 కేసుల పరిష్కారం
Comments
Please login to add a commentAdd a comment