ఎస్సై చొరవతో మహిళకు ఊరట
వేరే ఖాతాకు బదిలీ అయిన నగదు
తిరిగి అందజేత
కరకగూడెం: మండల పరిధిలోని కుర్నవల్లి గ్రామానికి చెందిన ఆవుల జుగుణమ్మ తాను పనికి వెళ్లిన చోట నుంచి ఇటీవల రూ. 28,000 ఫోన్ పే ద్వారా తన నంబర్‌కు పంపించుకుంది. మరుసటి రోజు నగదు తీసుకునేందుకు బ్యాంకుకు వెళ్లగా ఖాతాలో నగదు జమ కాలేదని అధికారులు తెలిపారు. జుగుణమ్మ ఫోన్ నంబర్ బ్లాక్ అవ్వడంతో, అదే నంబర్ వేరే వాళ్లు తీసుకుని ఫోన్ పేకు లింక్ చేసుకున్నారు. దీంతో నగదు సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలానికి చెందిన ఓ మహిళ ఖాతాలో జమైంది. పలుమార్లు బ్యాంకు చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కాకపోవడంతో రెండు రోజుల క్రితం కరకగూడెం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎస్సై రాజేందర్‌కు తన గోడు వెళ్లబోసుకుంది. దీంతో ఎస్సై స్పందించి ఓ కానిస్టేబుల్‌ను అక్కడికి పంపి సదరు ఖాతాదారురాలి అకౌంట్ నుంచి నగదు డ్రా చేయించి తెప్పించారు. గురువారం స్టేషన్‌లో బాధితురాలికి నగదు అప్పగించారు. దీంతో జుగుణమ్మ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. రైటర్ దుర్గారావు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment