పురుగు మందుకు బదులు గడ్డి మందు పిచికారీ
నేలకొండపల్లి: ఆరుగాలం కష్టపడి, అందిన దగ్గరల్లా అప్పులు తెచ్చి సాగుచేసిన వరి పంట చేతికందే సమయాన నిలువెల్లా మాడిపోయింది. పురుగుల నివారణ మందుకు బదులు గడ్డి నివారణ మందు పిచికారీ చేయడంతో ఈ పరిస్థితి ఎదురుకాగా రైతు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. నేలకొండపల్లి మండలం చెన్నారానికి చెందిన గంజికుంటల చిన్న సంగయ్య ఐదెకరాల్లో వరి సాగు చేశాడు. పంటకు మెడ విరుపు తెగులు సోకడంతో నివారణ మందుకు బదులు ఆయన గడ్డి నివారణ మందు పిచికారీ చేశాడు. దీంతో పంట మొత్తం ఎండిపోవడంతో రూ.2లక్షల మేర పెట్టుబడి, పంట చేతికొస్తే అందే రూ.4లక్షల ఆదాయం కోల్పోయినట్లేనని కన్నీరుమున్నీరవుతున్నాడు.
ఐదెకరాల్లో మాడిపోయిన వరి పంట
Comments
Please login to add a commentAdd a comment