నాగుపల్లిలో కార్డన్ అండ్ సెర్చ్
దమ్మపేట: మండలంలోని నాగుపల్లి గ్రామంలో గురువారం పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. దమ్మపేట, అశ్వారావుపేట మండలాల పోలీసులు గ్రామంలోని ప్రతి ఇంటిని జల్లెడ పట్టి సోదాలు చేశారు. వాహనాలకు సరైన ధ్రువ పత్రాలు ఉన్నాయా లేదా అని పరిశీలించారు. ధ్రువపత్రాలు లేని 32 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని, సీజ్ చేశారు. అనంతరం ఎస్సై సాయికిషోర్ రెడ్డి మాట్లాడుతూ యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, ఉన్నత విద్యను అభ్యసించి, భవిష్యత్తులో ఉన్నతంగా స్థిరపడాలని సూచించారు. గ్రామంలో అనుమానాస్పద రీతిలో ఎవరైనా సంచరిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో దమ్మపేట ఎస్సై సాయికిషోర్ రెడ్డి, అదనపు ఎస్సై బాలస్వామి, అశ్వారావుపేట ఎస్సైలు యయాతి రాజు, రామ్మూర్తి, ఎకై ్సజ్ ట్రైనీ ఎస్సైఅఖిల, తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment