కోడ్ ముగిసినా ముసుగు తొలగలే !
బూర్గంపాడు: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసినా రాజకీయ పార్టీల నాయకుల విగ్రహాలకు వేసిన ముసుగులు మాత్రం ఇంకా తొలగలేదు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా గత నెల 3న నోటిఫికేషన్ విడుదలైంది. నాటి నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో గ్రామాల్లోని రాజకీయ పార్టీల దివంగత నాయకుల విగ్రహాలకు అధికారులు ముసుగులు వేశారు. గత నెల 27న ఎన్నికలు నిర్వహించి ఈ నెల 3న ఫలితాలు వెల్లడించారు. ఎన్నికల కోడ్ ముగిసి 20 రోజులు గడుస్తున్నా విగ్రహాలకు వేసిన ముసుగులను మాత్రం అధికారులు తొలగించలేదు. సంబంధిత రాజకీయ పార్టీల నాయకులు కూడా తమ నాయకుడి విగ్రహానికి వేసిన ముసుగులు తొలగించకపోవటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment