ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త ఏడాదిలో భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు రోజంతా అదే జోరు కనబరిచాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్స్, మెటల్, ఐటీ, ఆటో రంగాల అండతో సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. పైగా గత ఏడాది చివరలో అమ్మకాలకు దిగిన విదేశీ మదుపర్లు తిరిగి కొత్తగా భారత్‌కు రానున్నారన్న అంచనాలూ కలిసొచ్చాయి. మరోవైపు త్రైమాసిక ఫలితాలు, బడ్జెట్ అంచనాలు వంటి పరిణామాలూ సూచీలకు దన్నుగా నిలిచాయి.
దీంతో చివరకు, బిఎస్ఈ సెన్సెక్స్ 929.40 పాయింట్లు (1.60 శాతం) పెరిగి 59,183.22కు చేరుకుంటే, నిఫ్టీ 50 271.70 పాయింట్లు(.57 శాతం) లాభపడి 17,625.70కి చేరుకుంది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.30 వద్ద ఉంది. బీఎస్ఈ 30లో నెస్ట్లీ ఇండియా, టెక్ మహీంద్రా, ఎం&ఎం, డాక్టర్. రెడ్డీస్ మినహా అన్నీ లాభాలను నమోదుచేశాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్స్, మెటల్, ఐటీ, ఆటో రంగాలు ఈ ర్యాలీకి నాయకత్వం వహించాయి.
Comments
Please login to add a commentAdd a comment