కేంద్రం అమలు చేస్తోన్న సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీం.. మలి దశలో అండగా నిలుస్తోంది. అతి తక్కువ మొత్తంతో ఈ స్కీములో చేరడమే కాకుండా ఎప్పుడైనా సరే డిపాజిట్ వెనక్కి తీసుకునే అవకాశం ఉండటంతో గత ఐదేళ్లుగా ఈ స్కీమ్‌లో చేరుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
వడ్డీ ఎక్కువ
సాధారణ సేవింగ్స్ అకౌంట్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్స్‌తో పోల్చితే సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌లో వడ్డీ ఎక్కువగా లభిస్తుంది. ఈ పథకంలో జమ చేసే సొమ్ముకు 7.40 శాతం వార్షిక వడ్డీని అందిస్తోంది. ఐదేళ్ల కాలానికి ఇందులో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత మరో మూడేళ్ల పాటు పొడిగించుకునే అవకాశం.
మినహాయింపులు
ఐదేళ్ల కాల పరిమితికి సీనియర్ సిటిజన్ పథకంలో పెట్టుబడి చేయాల్సి ఉంటుంది. అయితే రెండేళ్లలోపు డిపాజిట్ వెనక్కి తీసుకుంటే మొత్తం సొమ్ములో 1.5 శాతం మినహాయించుకుని చెల్లింపులు చేస్తారు. రెండేళ్ల నుంచి ఐదేళ్లలోపు డిపాజిట్ వెనక్కి తీసుకుంటే మొత్తం సొమ్ములో 1 శాతం మినహాయించుకుంటారు.
మరిన్ని వివరాలు
- సీనియర్ సిటీజన్స్ సేవింగ్స్‌లో డిపాజిట్ చేయాలంటే 60 ఏళ్లు పైబడిన వారు అర్హులు. ముందస్తుగా వీఆర్‌ఎస్ పెట్టుకుని 55 ఏళ్లు నిండిన వారూ ఈ పథకానికి అర్హులే.
- కనీస మొత్తం రూ. 1000 కాగా గరిష్టంగా రూ.15 లక్షల వరకు పెట్టుబడిగా పెట్టొచ్చు. డిపాజిట్ చేసిన మొత్తంపై 7.4 శాతం వడ్డీ లభిస్తుంది
- ఎప్పుడైనా డిపాజిట్‌ను వెనక్కి తీసుకోవచ్చు
- ఆదాయపు పన్ను చట్టం 80 సీ కింద పన్ను మినహాయింపు
- ఈ పథకంలో సేవ్ చేసిన వారు గరిష్టంగా 1.5 లక్షల రూపాలయను పన్ను మినహాయింపు పొందవచ్చు.
- పోస్టాఫీసు, బ్యాంకులలో ఈ సేవింగ్స్ పథకం అందుబాటులో ఉంది
- ప్రతీ మూడు నెలలకు ఒకసారి వడ్డీ చెల్లిస్తారు
పెరుగుతున్న ఆదరణ
బ్యాంకుల్లో వడ్డీ రేట్లు తగ్గిపోవడం, స్టాక్ మార్కెట్‌లో రిస్క్ ఎక్కువ కావడంతో సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ పథకానికి ఆదరణ పెరుగుతోంది. వాస్తవానికి 2018 వరకు ఈ పథకానికి వార్షిక వడ్డీ రేటు 8.4 శాతంగా ఉండేంది. ప్రస్తుతం తగ్గించి 7.4 శాతానికే పరిమితం చేశారు. ఐనప్పటికీ ఈ పథకాన్ని సీనియర్స్ ఆదరిస్తున్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఇందులో డిపాజిట్లు రూ. 24,754 కోట్లు ఉండగా 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఈ మొత్తం రూ.73,051 కోట్లకు చేరుకుంది.
చదవండి : gratuity amount: ఆ 9 లక్షల్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయమంటారు?
Comments
Please login to add a commentAdd a comment