విభిన్న తరహాకు చెందిన పారిశ్రామికవేత్త ఎలన్‌మస్క్ ట్విటర్‌పై మరో మైండ్‌గేమ్ షురూ చేశాడు. ఇటీవల ట్విటర్‌లో మేజర్ షేర్ హోల్డర్‌గా మారిన ఎలన్‌మస్క్.. ఆ తర్వాత ఏకంగా ట్విటర్‌ను ఏకమొత్తంగా కొంటానంటూ భారీ ఆఫర్ ఇచ్చాడు. దీనిపై చర్చ సద్దుమణగకముందే మరో కొత్త చర్చకు తెరతీశాడు.
ట్విటర్‌ను కొనుగోలు చేసేందుకు భారీ ఆఫర్ చేశానంటూ 2022 ఏప్రిల్ 14న ఎలన్ మస్క్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై ప్రపంచ వ్యాప్తంగా భారీ చర్చ జరిగింది. గల్లీ నుంచి ఇంటర్నేషనల్ మీడియా వరకు అంతటా దీనిపై చర్చ జరిగింది. ఓ పది గంటలు గ్యాప్ ఇచ్చి మరోసారి పోల్ నిర్వహించాడు ఎలన్‌మస్క్.
ట్విటర్‌ను ప్రైవేట్ పరం చేసేందుకు ఒక్కో షేరుకు ఆఫర్ చేసిన 54 డాలర్లు షేర్ హోల్డర్ల అంచనాలను అందుకుంది కానీ బోర్డు అంచనాలు అందుకోలేకపోయింది అంటు ప్రశ్నించి అవునో కాదో చెప్పాలంటూ ట్విటర్‌లోనే పోల్ చేశాడు. పది గంటల వ్యవధిలో ఎలన్‌మస్క్ ట్వీట్ రైట్ అంటూ 84 శాతం మంది, కాదంటూ 16 శాతం మంది ఓటేశారు.
ఫ్రీ స్పీచ్‌కి ఓ ప్లాట్‌ఫామ్ ఉండాలనేది తన లక్ష్యమంటూ గతంలో ఎలన్‌మస్క్ చెప్పారు. ఆ తర్వాత రెండేళ్లకు ట్విటర్‌లోనే ఫ్రీ స్పీచ్‌కి అవకాశం ఉందా అంటూ పోల్ నిర్వహించాడు. అది జరిగిన పది రోజులకే ట్విటర్‌లో మేజర్ షేర్ హోల్డర్ అయ్యాడు. ఆ తర్వాత ట్విటర్ బోర్డు సభ్యత్వం తీసుకోవాలని కోరితే దాన్ని నిరాకరించి మొత్తం ట్విటర్‌ను అమ్మేయాలంటూ ఆఫర్ చేసి ట్వీటర్ యాజమాన్యాన్ని తీవ్ర ఒత్తిడిలో నెట్టారు ఎలన్‌మస్క్.
Taking Twitter private at $54.20 should be up to shareholders, not the board
— Elon Musk (@elonmusk) April 14, 2022
ఎలన్ మస్క్ చేసిన భారీ ఆఫర్‌కి ఎలా స్పందించాలో తెలియక బోర్డు సభ్యులు సతమతం అవుతున్నారు. మరోవైపు మంచి ఆఫర్ అంటూ షేర్ హోల్డర్ల నుంచి ఒత్తిడి వస్తోంది. ఏం జరుగుతుందో తెలియక ట్విటర్ ఉద్యోగులు అయోమయంలో ఉన్నారు. ఈ తరుణంలో తన ఆఫర్‌పై అభిప్రాయం చెప్పాలంటూ మరో పోల్ నిర్వహించార ఎలన్‌మస్క్. ప్రపంచ కుబేరుల్లో తన స్టైల్ డిఫరెంట్ అంటూ మరోసారి స్పష్టం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment