
ముంబై: ప్రైవేటు రంగంలోని ఇండస్‌ఇండ్ బ్యాంకు సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో పనితీరు మెరుగుపరుచుకుంది. కన్సాలిడేటెడ్‌గా నికర లాభం 73 శాతం పెరిగింది. రూ.663 కోట్ల లాభాన్ని బ్యాంకు ప్రకటించింది. రుణాల్లో వృద్ధికితోడు, ఎన్‌పీఏలకు (వసూలు కాని మొండి రుణాలు) కేటాయింపులు తగ్గడం లాభం పెరిగేందుకు దోహదపడింది. సూక్ష్మ, వాహన రుణ విభాగం లో ఒత్తిళ్లు ఉన్నట్టు బ్యాంకు ప్రకటించింది.
► నికర వడ్డీ ఆదాయం 12 శాతం పెరిగి రూ.3,658 కోట్లకు చేరింది.
► నికర వడ్డీ మార్జిన్ 4.07 శాతంగా ఉంది.
► ఫీజుల రూపంలో ఆదాయం రూ.1,554 కోట్ల నుంచి రూ.1,838 కోట్లకు పెరిగింది.
► సెప్టెంబర్ త్రైమాసింకలో రూ.2,658 కోట్ల రుణాలు ఎన్‌పీఏలుగా మారాయి.
► స్థూల ఎన్‌పీఏలు 2.77 శాతానికి చేరాయి. ఇవి అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికం నాటికి 2.21శాతంగా ఉంటే, ఈ ఏడాది జూన్ త్రైమాసికం చివరికి 2.88 శాతంగా ఉన్నాయి.
► కేటాయింపులు రూ.1,703 కోట్లకు తగ్గాయి.