ఫొటో కనిపిస్తున్నది విఠలాచార్య సినిమాల్లోని కంకాళంలా ఉంది కదూ! ఇది కంకాళం కాదు, మోడర్న్ గరుడావతారం. అమెరికాలోని కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కాల్‌టెక్) శాస్త్రవేత్తలు ‘లియోనార్డో’ పేరిట రూపొందించిన రోబో ఇది.
దీనిలోని ప్రత్యేకత ఏమిటంటే, ఇది మనిషిలా నేల మీద రెండుకాళ్లతో నడవగలదు. డేగలా ఆకాశంలో రివ్వున ఎగరగలదు. ఒకరకంగా ఇది రోబో ద్రోన్. ఎంత ఎత్తు ఎగిరినా, భూమ్మీద ఎలాంటి ఉపరితలంపైన అయినా ఇట్టే వాలగలిగేలా దీన్ని తీర్చిదిద్దారు.
అంగారకుని ఉపరితలంపై కూడా వాలేందుకు అనువుగా దీనికి మరిన్ని మెరుగులు దిద్దుతున్నట్లు ‘కాల్‌టెక్’ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment