
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ముగింపు పలికాయి. నిన్న నష్టాలతో ముగిసినా బుధవారం ఆటోమొబైల్, రియాలి, పవర్ అండ్ కేపిటల్ గూడ్స్ షేర్ల కొనుగోలుతో నేడు భారీ లాభాల బాట పట్టాయి.
దీంతో బుధవారం మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 526 పాయింట్ల లాభంతో 72,996 వద్ద నిఫ్టీ 119 పాయింట్ల లాభంతో 22,123 వద్ద ముగిశాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతి సుజికీ, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, టైటాన్ కంపెనీ షేర్లు లాభాల్లో ముగియగా, హీరోమోటో కార్పో, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, అపోలో హాస్పిటల్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, విప్రోలో నష్టాలతో సరిపెట్టుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment