న్యూఢిల్లీ: టెలికం రంగానికి సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఇటీవల నోటిఫై చేసిన కొత్త రైట్ ఆఫ్ వే రూల్స్ ప్రకారం.. ప్రైవేట్ భవనాలు, స్థలాల్లో మొబైల్ టవర్లు, స్తంభాలను అమర్చడం, కేబుల్స్ ఏర్పాటుకు టెలికం కంపెనీలకు ఎటువంటి అనుమతి అవసరం లేదు.
అయితే సంబంధిత అధికారులకు ముందస్తుగా రాతపూర్వకంగా సమాచారం తప్పనిసరి. భవనం, నిర్మాణం వివరాలు, ఎంత మేరకు భద్రంగా ఉన్నదీ స్ట్రక్చరల్ ఇంజనీర్ నుంచి ధ్రువీకరణతో సమాచారాన్ని టెలికం కంపెనీలు అందించాల్సి ఉంటుంది. 5జీ సేవలు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment