ఇండియన్ బిగ్ బుల్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా పరిచయం అక్కర్లేని పేరు. దేశీయ స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ గురూగా పేరు తెచ్చుకున్న రాకేష్ ఆయన చేయి పెడితే చాలు.. ఎందుకు పనికి రావనుకునే పెన్నీ స్టాక్స్ సైతం బంగారం మయం అవుతాయి. ముదుపర్లకు కాసుల వర్షం కురిపిస్తాయి. అలాంటి మార్కెట్‌లో రాకేష్ ఝున్‌ఝున్‌వాలా గతేదాది ఓ ఐదు షేర్లమీద ఇన్వెస్ట్ చేశారు. ఇన్వెస్ట్‌మెంట్ చేసిన ఆ షేర్ వ్యాల్యూ ఏడాది తిరిగేసరికల్లా.. డబులు త్రిబుల్ ఆయ్యింది. రాకేష్ ఆస్తి మరో రూ.1500కోట్లు పెరిగింది.
దలాల్ స్ట్రీట్ మెగస్టార్ ఇన్వెస్ట్ చేసిన టైటాన్ స్టాక్స్ గురించి ప్రముఖంగా చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఎన్నో ఏళ్ల క్రితం రాకేష్ ఝున్‌ఝున్‌వాలా టైటాన్ స్టాక్స్ పై ఇన్వెస్ట్ చేశాడు. కానీ ఎన్నడూ లేని విధంగా గత మూడు నెలల నుంచి ఆ స్టాక్ వ్యాల్యూ విపరీతంగా పెరిగింది. గత 3 నెలల్లో స్టాక్ రూ. 2161.85 (30 సెప్టెంబర్ 2021న నేషనల్‌స్టాక్ ఎక్చేంజ్ ముగింపు ధర) నుండి రూ. 2517.55 (31 డిసెంబర్ 2021న ఎన్‌ఎస్‌ఈలో ముగింపు ధర)కి పెరిగింది. స్టాక్ ధరలో భారీ పెరుగుదలతో, రాకేష్ జున్‌జున్‌వాలా నికర విలువ రూ. 1540 కోట్లు పెరిగింది.
రాకేష్ ఝున్‌జున్‌వాలా షేర్‌హోల్డింగ్ ప్యాటర్న్
సెప్టెంబరు త్రైమాసికపు షేర్‌హోల్డింగ్ సరళి ప్రకారం, బిగ్ బుల్ రాకేష్ జున్‌జున్‌వాలా, అతని భార్య రేఖా జున్‌జున్‌వాలా టాటా గ్రూప్ కంపెనీ అయిన టైటాన్‌లో దాదాపు 4.87 శాతం లేదా 4,33,00,970 ఈక్విటీ షేర్లను కలిగి ఉన్నారు. 30 సెప్టెంబర్ 2021 నాటికి, ఎన్‌ఎస్‌ఈలో స్టాక్ రూ. 2161.85 వద్ద ముగిసింది. కాగా, ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు రూ.2517.55 వద్ద ముగిసింది. అంటే 3 నెలల్లో ఒక్కో షేరు దాదాపు రూ.355.70 లాభపడింది.
ఈ షేర్‌లలో ఇన్వెస్ట్ చేస్తే కాసుల వర్షమేనా
ఇక స్టాక్ మార్కెట్ గురించి తెలిసిన ప్రతీ ఒక్కరూ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా షేర్లమీద వేలకోట్లు పెట్టుబడులు పెట్టడం, భారీ ఎత్తున లాభాల్ని అర్జించడం షరామామూలే. అందుకే ఇన్వెస్టర్లు ఝున్‌ఝున్‌వాలా ఏ చిన్న న్యూస్ వచ్చినా ఆసక్తిని కనబరుస్తారు. ముఖ్యంగా స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేస‍్తే లాభాలు వస్తాయని నమ్ముతారు. అదే సమయంలో స్టాక్ మార్కెట్‌పై అనుభవం ఉంటేనే ఇన్వెస్ట్ చేయాలని, లేదంటే వద్దని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చదవండి: మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? సోషల్ మీడియాతో జాగ్రత్త!!
Comments
Please login to add a commentAdd a comment