న్యూఢిల్లీ: కార్పొరేట్ బాండ్ మార్కెట్‌కు ప్రోత్సాహకంగా సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. కమర్షియల్ పేపర్లు, సర్టిఫికెట్ ఆఫ్ బాండ్లు తదితర సెక్యూరిటీల రెపో లావాదేవీల్లో పెట్టుబడులకు మ్యూచువల్ ఫండ్స్‌ను అనుమతించింది.
ఏఏ, అంతకు మించి రేటింగ్ కలిగిన కార్పొరేట్ డెట్ సెక్యూరిటీల రెపో లావాదేవీల్లో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు పెట్టుకోవ చ్చని సెబీ స్పష్టం చేసింది. రెపో లావాదేవీలను రెపో అని లేదంటే విక్రయ–కొనుగోలు ఒప్పందంగా పరిగణిస్తారు. సెక్యూరిటీలను విక్రయించిన సంస్థే అంగీకరించిన రేటుపై తిరిగి వాటిని కొనుగోలు చేస్తుంది. నూతన ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని సెబీ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment