
శుక్రవారం ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్లు తాజా రికార్డ్ స్థాయిలో గరిష్టాన్ని తాకాయి. నిఫ్టీ 21,300 వద్ద ప్రారంభమైంది
ఉదయం 9.20గంటల సమయానికి సెన్సెక్స్ 282.80 పాయింట్లు లాభంతో 70,797 వద్ద, నిఫ్టీ 87.30 పాయింట్లు లాభంతో 21,270 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తున్నాయి. దాదాపు 1712 షేర్లు అడ్వాన్స్‌లో ట్రేడ్ అవుతుండగా , 411 షేర్లు క్షీణించాయి. 109 షేర్లు స్థిరంగా కొనసాగుతున్నాయి.
నిఫ్టీలో ఇన్ఫోసిస్, హిందాల్కో, జెఎస్‌డబ్ల్యు స్టీల్, టాటా స్టీల్, ఓఎన్‌జీసీ షేర్లు లాభాల్లో ఉండగా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, పవర్ గ్రిడ్ కార్ప్, ఎయిర్‌టెల్, నెస్లే, బ్రిటానియా నష్టాల్లో కొనసాగుతున్నాయి.