
దేశీయ స్టాక్ మార్కెట్‌లో లాభాల పరంపర కొనసాగుతుంది. జాతీయ, అంతర్జాతీయ అనుకూల ప్రభావంతో బుధవారం సైతం మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి.
ఆసియా మార్కెట్‌లలో పాజిటీవ్ సంకేతాలు దేశీయ మార్కెట్‌లకు మరింత కలిసి వచ్చింది. ఫలితంగా మార్కెట్లు ముగిసే సమయానికి గంట ముందు నిఫ్టీ, సెన్సెక్స్ సరికొత్త గరిష్టాల్ని తాకాయి. చివరిగా మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 405 పాయింట్ల భారీ లాభంతో 69,701 వద్ద నిఫ్టీ 94 పాయింట్ల లాభంతో 20,949 వద్ద ముగిశాయి.
విప్రో, ఎల్‌అండ్ టీ మైండ్ ట్రీ,ఐటీసీ, లార్సెన్, టీసీఎస్, టాటామోటార్స్, నెస్లే, ఇన్ఫోసిస్, యూపీఎల్, ఎం అండ్ ఎం షేర్లు లాభాల్లో ముగియగా.. అదానీ ఎంటర్ ప్రైజెస్, సిప్లా, ఎన్‌టీపీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హీరో మోటోకార్ప్ షేర్లు నష్టాల్ని మూటగట్టుకున్నాయి.
కలిసొచ్చిన ఎన్నికలు
దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఓటర్లు మూడు రాష్ట్రాల్లో బీజేపీకి జై కొట్టడంతో స్టాక్ మార్కెట్లు ఊపందుకున్నాయి. మదుపర్లకు ఉపశమనం కలగడంతో కొనుగోళ్లు ఎక్కువయ్యాయి. అదే సమయంలో దేశంలోకి విదేశీ పెట్టుబడులు జోరందుకున్నాయని మెహతా ఈక్విటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సే అభిప్రాయం వ్యక్తం చేశారు.
తస్మాత్ జాగ్రత్త!
దేశీయ స్టాక్ సూచీల ట్రెండ్ ఇలాగే కొనసాగే అవకాశం ఉందని అంచనా వేసిన ప్రోగ్రెసీవ్ షేర్ బ్రోకర్స్ సంస్థ డైరెక్టర్ ఆధిత్య గర్గే.. ఇప్పటికే మార్కెట్‌లో భారీ ఎత్తున కొనుగుళ్లు జరిగాయని, ఈ విషయంలో మదుపర్లు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
మార్కెట్‌లో ఆయా స్టాక్స్ పనితీరు ఎలా ఉందంటే?
♦డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడం ఇన్వెస్టర్లు టెక్నాలజీ స్టాక్స్ కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ఈ నిర్ణయం ఈ రంగానికి కొంత మార్జిన్ ఒత్తిడిని తగ్గించగలదని నిపుణులు భావిస్తున్నారు. విప్రో , టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఎల్‌టిఐమైండ్‌ట్రీ షేర్లు దాదాపు 2-3 శాతం పెరిగాయి.
♦ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు పాజిటీవ్ రేటింగ్ ఇవ్వడంతో ఆ సంస్థ షేర్ల కొనుగోలు జరిగాయి. ఆ షేర్ల విలువ ఒక శాతానికి పైగా పెరిగింది.
♦అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ఫినాన్స్ కార్పొరేషన్ (డీఎఫ్‌సీ) హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలు అసంబద్ధం అని తేల్చడంతో దేశీయ స్టాక్ మార్కెట్‌లో అదానీ గ్రూప్ షేర్ల ర్యాలీ జోరు కొనసాగుతుంది. అదానీ పోర్ట్స్ 2 శాతం పెరిగి నిఫ్టీ 50లో టాప్ గెయినర్‌లలో ఒకటిగా నిలిచింది.
♦ఎథేర్ మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు క్షీణించాయి. 1-2 శాతం పడిపోయాయి. పెన్నీ స్టాక్స్ జోరును కొనసాగించడం విశేషం.
♦బ్యాంకింగ్ పేర్లలో ప్రాఫిట్-బుకింగ్ మునుపటి సెషన్‌లో రికార్డు స్థాయికి పెరిగిన తర్వాత నిఫ్టీ బ్యాంక్ నష్టపోయింది.
♦నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 0.4 శాతం, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 0.2 శాతం పెరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment