
ముంబై: ప్రపంచ మార్కెట్ల బలహీనతలతో రెండు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. నష్టాలతో ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు రోజంతా నేలచూపులకే పరిమితమయ్యాయి. అయితే తొలి సెషన్‌తోపాటు, చివరి సెషన్లలో నామమాత్రంగా కోలుకున్నాయి. చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి.
సెన్సెక్స్ 31 పాయింట్లు క్షీణించి 58,191 వద్ద నిలవగా.. నిఫ్టీ 17 పాయింట్లు తక్కువగా 17,315 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 371 పాయింట్లు కోల్పోయి 57,851 వద్ద కనిష్టానికి చేరింది. చమురు దేశాల (ఒపెక్) సరఫరా కోతలతో క్రూడ్ ధరలు పెరిగాయి. ఇది రూపాయిని దెబ్బతీసింది. యూఎస్‌సహా విదేశీ మార్కెట్లు ఆటుపోట్లను చవిచూస్తుండటంతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు కొనసాగుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.
టైటన్ జోరు: ఎన్‌ఎస్‌ఈలో ఐటీ, ఆయిల్, ఫార్మా రంగాలు 0.75 శాతం క్షీణించగా.. కన్జూమర్ డ్యూరబుల్స్ 1.3 శాతం ఎగసింది. నిఫ్టీ దిగ్గజాలలో టైటన్ 5.3% జంప్‌చేయడం ఇందుకు సహకరించింది. ఇతర బ్లూచిప్స్‌లో పవర్‌గ్రిడ్, గ్రాసిమ్, ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, ఇండస్‌ఇండ్, మారుతీ 1.5–1% మధ్య పుంజుకోగా.. టాటా కన్జూమర్, బీపీసీఎల్, ఎంఅండ్‌ఎం, అల్ట్రాటెక్, ఎస్‌బీఐ, జేఎస్‌డబ్ల్యూ, టీసీఎస్, ఐషర్, సీఐఎల్, అదానీ పోర్ట్స్, హెచ్‌సీఎల్ టెక్ 2–1% మధ్య నష్టపోయాయి.