మంగళవారం ఉదయం స్వల్ప లాభాలతో ముందుకు సాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ లాభాల వద్ద ముగిశాయి. సెన్సెక్స్ 578.66 పాయింట్లు లేదా 0.72 శాతం లాభంతో 80,826.74 వద్ద, నిఫ్టీ 168.70 పాయింట్లు లేదా 0.69 శాతం లాభంతో 24,444.75 వద్ద నిలిచాయి.
అదానీ పోర్ట్స్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), అదానీ ఎంటర్‌ప్రైజెస్, యాక్సిస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. భారతీ ఎయిర్‌టెల్, ఐటీసీ కంపెనీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్, సన్ ఫార్మా వంటి కంపెనీలు నష్టాన్ని చవిచూశాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం 9:53 సమయానికి నిఫ్టీ 54 పాయింట్లు లాభపడి 24,328కు చేరింది. సెన్సెక్స్ 193 పాయింట్లు పుంజుకుని 80,431 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 106.44 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 71.8 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.2 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.24 శాతం లాభపడింది. నాస్‌డాక్ 0.97 శాతం పుంజుకుంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికం (జులై–సెపె్టంబర్)లో దేశ ఆర్థిక వ్యవస్థ అంచనాలను అందుకోలేకపోయింది. గత 7 త్రైమాసికాలలోనే అత్యల్పంగా 5.4 శాతంగా నమోదైంది. జీడీపీ గణాంకాలు గత వారాంతాన మార్కెట్లు ముగిశాక వెలువడినా దాని ప్రభావం సోమవారం మార్కెట్లపై పెద్దగా కనిపించలేదు. ఆర్‌బీఐ త్వరలో కీలక వడ్డీరేట్లపై నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటి వరకు వస్తున్న సమాచారం మేరకు రెపోరేటును స్థిరంగా ఉంచి, సీఆర్‌ఆర్ వంటి సూచీల్లో మార్పులు చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు ఆర్‌బీఐ పాలసీ నిర్ణయాలపై దృష్టి పెట్టనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment