చిత్తూరు: ‘యోవ్, నేను జనసేన పార్టీనే. కానీ మా పవన్‌కల్యాణ్ పోయి చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నాడని నేను సైకిల్‌కు ఓటు ఏసేదిలేదు. ఈ సారి నా ఓటు ఫ్యానుకే’ అంటూ కర్లగట్టుకు చెందిన జనసేన కార్యకర్త శివ మాట. బైకుపై కూర్చున్న శివ మాట్లాడిన ఈ మాటలను తన మిత్రులు కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్త వైరల్ అయింది. పంచాయతీ కేంద్రమైన కర్లగట్టకు చెందిన శివ చిన్నతనం నుంచి పవన్‌కల్యాణ్‌కు వీరాభిమాని.
పవన్ సినిమా ఎక్కడ వేసినా మొదటిరోజే తొలి ఆట చూసేవాడు. ఏటా మిత్రులతో కలిసి పవన్‌కల్యాణ్ జన్మదినాన్ని గ్రామంలో ఘనంగా జరిపేవాడు. తన బంధువులు ఇతర పార్టీల్లో ఉన్నా జనసేన పార్టీ పెట్టాక తాను మాత్రం ఆ పార్టీ కోసమే నిలబడ్డాడు. గ్రామంలో ఫ్లెక్సీలు పెట్టి హడావుడి చేశాడు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి తరఫున ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నాడు. కానీ ఇప్పుడు టీడీపీతో తమ పార్టీ పొత్తు పెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. తన అభిమాన నాయకుడిని అందరికంటే టీడీపీ వాళ్లే ఎక్కువగా తిట్టారని, అలాంటి పార్టీకి తాను ఓటు వేయనని శివ తేల్చి చెప్పాడు. ఎలాంటి వివక్ష చూపకుండా జనానికి మేలు చేసిన జగన్‌మోహన్‌రెడ్డికే ఈదఫా ఓటు వేస్తానన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment