
కడప అర్బన్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ బృందం మంగళవారం ఏడుగురిని విచారించింది. వారిలో యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (యూసీఐఎల్)లో ఉద్యోగిగా పనిచేస్తూ, పులివెందులలో ఉంటున్న ఉదయ్‌కుమార్‌రెడ్డి, పులివెందులకు చెందిన కాంపౌండర్ ప్రకాష్‌రెడ్డి, తిరుపతిలోని సంకల్ప హాస్పిటల్‌లో వైద్యుడిగా పనిచేస్తున్న డాక్టర్ సతీష్‌కుమార్‌రెడ్డి, డాక్టర్ మధు, యూసీఐఎల్‌లో పనిచేస్తున్న మరో ఉద్యోగి కిషోర్‌కుమార్‌రెడ్డి, ప్రొద్దుటూరుకు చెందిన ట్రాక్టర్ షెడ్ యజమాని భాస్కర్‌రెడ్డి, పులివెందులకు చెందిన డాక్టర్ నాయక్‌లు ఉన్నారు.