
సాక్షి, కామారెడ్డి: ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బెంగళూరులోని తన ఇంట్లో విగతజీవిగా పడి ఉంది. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు హుటాహుటిన అక్కడికి పయనమయ్యారు. అల్లుడే తమ కూతురిని హత్య చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వివరాలు.. కామారెడ్డికి చెందిన శరణ్య (25) సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా పనిచేస్తోంది. ఈ క్రమంలో అదే పట్టణానికి చెందిన, తన క్లాస్‌మేట్ అయిన రోహిత్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇద్దరూ బెంగళూరులో ఉంటున్నారు.(అత్తపై అల్లుడి దాడి)
కాగా పెళ్లైన కొన్నాళ్ల తర్వాత నుంచే రోహిత్ నిత్యం మద్యం సేవిస్తూ ఆమెను కొట్టడం ప్రారంభించాడు. భర్త వేధింపులు తట్టుకోలేక శరణ్య ఇటీవలే తల్లిగారింటికి వచ్చింది. దీంతో అక్కడికి చేరుకున్న రోహిత్.. ఇకపై భార్యను కష్టపెట్టనని, వేధింపులకు గురిచేయనని పెద్దల సమక్షంలో ఒప్పుకొని మూడు నెలల కిందటే ఆమెను మళ్లీ కాపురానికి తీసుకువెళ్లాడు. ఈ నేపథ్యంలో శరణ్య మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. రోహితే తమ కూతురిని చంపేసి ఉంటాడని లేదా ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించి ఉంటాడని ఆమె తల్లి మాధవి ఆరోపిస్తున్నారు. రోహిత్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.(పెళ్లి ఇష్టం లేక యువతి బలవన్మరణం)
Comments
Please login to add a commentAdd a comment