
సాక్షి, మైసూరు : ఫోన్ విషయంలో ఏర్పడిన కలహాలు మూడు ప్రాణాలను బలిగొన్నాయి. ఇద్దరు పసికందులకు ఉరి బిగించిన తల్లి ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన మైసూరు గాయత్రిపురలో చోటు చేసుకుంది. ఉదయగిరి పోలీసుల కథనం మేరకు గాయత్రి పురలో ముజామిల్, సోఫియా(24) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి మునేజా(3), ఇనయ అనే ఏడాది కుమారుడు ఉన్నాడు. సోఫియా ఓ ప్రైవేటు కంపెనీలో ఇంజనీరుగా పనిచేస్తోంది. సోఫియా స్మార్ట్ ఫోన్‌లో ఎక్కువగా మాట్లాడేది. దీంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. (పరువుహత్య: ప్రేమించి పరువు తీసిందని..)
పిల్లలకు ఉరివేసి..
శుక్రవారం రాత్రి కూడా గొడవ పడ్డారు. మనో వేదనకు గురైన సోఫియా తన ఇద్దరు పిల్లలకు ఉరివేసి అనంతరం తానూ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. శనివారం ఉదయం పోలీసులు వచ్చి మృతదేహాలను ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.