
నెల్లూరు(క్రైమ్): టీడీపీలో చేరాలని ఆహ్వానిస్తే తిరస్కరించాడన్న కక్షతో ఓ వైఎస్సార్‌సీపీ దళిత కార్యకర్తపై టీడీపీ నేతలు మారణాయుధాలతో దాడి చేసిన ఘటన నెల్లూరు గాంధీనగర్‌లో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. నెల్లూరు బట్వాడిపాళెం సెంటర్‌కు చెందిన కుమార్ హరికుమార్ వైఎస్సార్‌సీపీ కార్యకర్త. ఆయన మంగళవారం రాత్రి నెల్లూరు గాంధీనగర్‌లోని రేష్మ హోటల్‌కు బిర్యానీ తినేందుకు వెళ్లారు.
టీడీపీ నేతలు మాజీ కార్పొరేటర్ డిష్ పెంచలయ్య, మాజీ కార్పొరేటర్ రాజానాయుడు, జలదంకి సుధాకర్, బుజ్జిగాడు బిర్యానీ హోటల్ యజమాని రమేష్, సాభీర్‌ఖాన్ అక్కడ మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో రాజానాయుడు ‘మా పార్టీలోకి రమ్మని రెండు సార్లు పిలిచాను నీవు ఎందుకు రాలేదు డ్రైవర్ నా...’ అని అసభ్యకర పదజాలంతో దూషిం చి దాడి చేశారు. గాయపడిన హరికుమార్‌ను స్నేహితులు జీజీహెచ్‌కు, అక్కడి నుంచి అపోలో ఆస్పత్రికి తరలించారు.