షిప్ ‌యార్డు ప్రమాద ఘటనపై రెండు కమిటీలు | Two Committees To Investigate On Crane On Trial Run Crashes | Sakshi
Sakshi News home page

షిప్ ‌యార్డు ప్రమాద ఘటనపై రెండు కమిటీలు

Published Sat, Aug 1 2020 8:43 PM | Last Updated on Sat, Aug 1 2020 8:43 PM

Two Committees To Investigate On Crane On Trial Run Crashes - Sakshi

విశాఖపట్నం: హిందూస్తాన్‌ షిప్ ‌యార్డులో ఘోర ప్రమాదం చోటు చేసుకుని పదిమంది మృత్యువాత పడ్డారు. శనివారం భారీ క్రేన్‌ ట్రయల్‌ నిర్వహిస్తుండగా అది కుప్పకూలడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ముందుగా పదకొండు మంది మృతి చెందినట్టు భావించిన సహాయ సిబ్బంది పూర్తిగా  శిధిలాలు తొలగించడంతో 10 మృతదేహాలు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తులు వెంకట్రావు, చైతన్య, రమణ, పి.వి. రత్నం, పి నాగ దేవుళ్ళు, సత్తిరాజు, శివ కుమార్, కాకర్ల ప్రసాద్, జగన్, పి భాస్కర్ లుగా గుర్తించారు. (హిందుస్తాన్‌ షిప్ యార్డ్‌లో ఘోర ప్రమాదం)

మృతుల్లో నలుగురు హిందుస్తాన్ షిప్ యార్డ్ ఉద్యోగులు, ముగ్గురు ఎం ఎస్ గ్రీన్ ఫీల్డ్ ఉద్యోగులు,ఇద్దరు లీడ్ ఇంజినీరింగ్ కంపెనీ ఉద్యోగులు, మరొకరు ఎమ్మెస్ స్క్వాడ్ సెవెన్ కంపెనీ ఉద్యోగి ఉన్నారు.  షిప్ యార్డు ప్రమాదంపై మల్కాపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యాయి. ఈ ప్రమాద ఘటనపై విచారణకు రెండు కమిటీలు ఏర్పాటు చేశారు. షిప్ యార్డ్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఓ కమిటీ, ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో మరో కమిటీని ఏర్పాటు చేశారు.  ప్రమాదంపై ఏర్పాటు చేసిన రెండు కమిటీలు వారం రోజుల్లోగా నివేదికకు ఇవ్వాలని గడువు నిర్దేశించారు. (హిందుస్తాన్‌ షిప్ ‌యార్డు ప్రమాదంపై సీఎం జగన్‌ ఆరా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement