స్నేహితులతో కలిసి భార్యపై అత్యాచారం | Women Molested By Hunband And His Friends In Guntur | Sakshi
Sakshi News home page

భార్యపై భర్త, అతని స్నేహితుల అత్యాచారం

Dec 20 2020 3:35 PM | Updated on Dec 20 2020 3:35 PM

Women Molested By Hunband And His Friends In Guntur - Sakshi

పట్నంబజారు(గుంటూరు): భార్యపై భర్త, అతని స్నేహితులు లైంగిక దాడికి పాల్పడిన ఘటనపై కేసు నమోదైంది. గుంటూరు నగరంపాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  గుంటూరు ఏటీ అగ్రహారానికి చెందిన షేక్‌ మీరావలి అలియాస్‌ బాబుకు అదే ప్రాంతానికి చెందిన మహిళతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. మనస్పర్థల కారణంగా కొంతకాలంగా ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. ఈ నెల 17న భార్య బంధువులు, బాబు మధ్య వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో బాబు నగరంపాలెం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై అదేరోజు వివాదాలు ఎందుకని, కలిసి ఉందామని అడిగేందుకు భార్య.. భర్త బాబు ఇంటి వద్దకు వెళ్లింది.

ఈ క్రమంలో భర్త బాబు, అతని స్నేహితులు రబ్బాని, సలీంలు కలిసి మద్యం తాగుతున్నారు. వివాదాలు వద్దని కేసులు విత్‌డ్రా చేసుకుని జీవనం సాగిద్దామని అడిగేందుకు వెళ్లిన భార్యపై భర్త బాబు, అతని స్నేహితులు రబ్బాని, సలీం కలిసి లైంగిక దాడికి పాల్పడ్డారు. కొద్దిసేపటికి రోడ్డుపై పడివున్న ఆమెను బంధువులు, స్థానికులు ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement