సంక్షేమం కొనసాగాలంటే జగనే రావాలి | Sakshi
Sakshi News home page

సంక్షేమం కొనసాగాలంటే జగనే రావాలి

Published Tue, May 7 2024 11:35 AM

సంక్షేమం కొనసాగాలంటే  జగనే రావాలి

వైఎస్సార్‌ సీపీ ఎన్‌ఆర్‌ఐ

విభాగం నాయకులు

కొవ్వూరు చేరుకున్న బస్సుయాత్ర

కొవ్వూరు: రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మరోసారి జగన్‌ ముఖ్యమంత్రి కావాలని వైఎస్సార్‌ సీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం నాయకులు అన్నారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుపై ఓట్లు వేసి, వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. వైఎస్సార్‌ సీపీకి మద్దతుగా వారు చేపట్టిన బస్సుయాత్ర సోమవారం సాయంత్రానికి కొవ్వూరు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, తామంతా జగనన్నకి మద్దతుగా బస్సుయాత్ర చేస్తున్నామన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ విజయభేరి మోగించడం ఖాయమన్నారు. అన్ని వర్గాల ప్రజలూ వైఎస్సార్‌ సీపీ మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారన్నారు. ఎల్లో మీడియా, కూటమి పార్టీలు ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై దుష్ప్రచారం చేస్తున్నాయని, ఆ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా, ఎన్ని మోసపూరిత హామీలు ఇచ్చినా రానున్నది వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. కొవ్వూరు నియోజకవర్గంలో ఎన్‌ఆర్‌ఐ విభాగం నాయకుడు పసుపులేటి వీరభద్రరావు సారథ్యంలో తాళ్లపూడి మండలంలోని తిరుగుడు మెట్ట, పెద్దేవం, బల్లిపాడు, వేగేశ్వరపురం గ్రామాలతో పాటు కొవ్వూరు పురపాలక సంఘంలో పర్యటించారు. యూరప్‌ కన్వీనర్‌ యల్లాప్రగడ కార్తిక్‌, అమెరికా కన్వీనర్‌ కోడూరు కృష్ణారెడ్డి, స్విట్జర్లాండ్‌కు చెందిన బావిగడ్డ బ్రహ్మానందరెడ్డి, ఇటలీకి చెందిన కిషోర్‌ యాదవ్‌, నెదర్లాండ్స్‌ నుంచి సారథి రెడ్డి వంగా, కువైట్‌ ప్రతినిధి కుమార స్వామి, దుబాయ్‌ నుంచి వెంకట రామయ్య, రాష్ట్ర ఐటీ విభాగం కార్యదర్శి నానిరెడ్డి, యూఎస్‌ఏకి చెందిన సుభాషిణి, రాష్ట్ర ఐటీ విభాగం కార్యదర్శి కృపాసాగర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొవ్వూరులో ఎమ్మెల్యే తలారి వెంకట్రావుని కలిసి తన సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో నాయకులు తోట రామకృష్ణ, చెట్టే సుభాషిణి తదితరులు పాల్గొన్నారు.

కొనసాగిన పోస్టల్‌ బ్యాలెట్‌

అమలాపురం రూరల్‌: పోస్టల్‌ బ్యాలెట్‌లో భాగంగా రెండోరోజు సోమవారం 41.65 శాతం పోలింగ్‌ జరిగింది. ఎన్నికల విధులలో పాల్గొనే పీవో, ఏపీవో, ఓపీవో, ఎంఓలతో పాటు పోలీసులు, మెడికల్‌ సిబ్బంది, ఇతర సర్వీసు ఉద్యోగులు పోస్టల్‌ ఓటు వేశారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎంపిక చేసిన పోలింగ్‌ బూత్‌లలో వీరంతా తమ ఓటును సద్వినియోగం చేసుకున్నారు. జిల్లాలో 14,566 మంది పీవో, ఏపీవో, ఓపీవో, ఎంఓతో పాటు ఇతర ఓటర్ల ఉన్నారు. వీరిలో ఆదివారం సాయంత్రం ఆరు గంటల సమయానికి 6,927 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మిగిలిన 7,639 మందిలో సోమవారం 3,182 ఓటు వేశారు. రాజోలు అసెంబ్లీ స్థానంలో అత్యధికంగా 1,111 మందికి గాను 635 మంది (47.16 శాతం) ఓటు వేశారు. అత్యల్పంగా మండపేట నియోజకవర్గంలో 1,178 మందికి 232 మంది (22.34) వినియోగించుకున్నారు.

Advertisement
 
Advertisement