శృంగేరి పీఠ జగద్గురువుల దర్శనానికి పోటెత్తిన భక్తులు
మలికిపురం: రెండు రోజుల పర్యటననిమిత్తం మలికిపురం మండలం గుడిమెళ్ళంక చేరుకున్న దక్షిణామ్నాయ శ్రీ శృంగేరి పీఠ జగద్గురువులు విధుశేఖర భారతీ మహాస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. సంప్రదాయ వస్త్ర ధారణలో వేలాదిమంది స్వామి వారిని దర్శించుకున్నారు. వలంటీర్లు, పోలీసులు, ప్రత్యేక ఏర్పాట్లతో భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేశారు. గ్రామంలోని శివాలయం పునర్నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. రాజోలు ఎమ్మెల్యే దేవవరప్రసాద్, మాజీ ఎమ్మెల్యే ఎంఎ వేమా, మార్క్‌ఫెడ్ డైరెక్టర్ గుండుబోగుల పెదకాపు, ఎంపీపీ మేడిచర్ల వెంకట సత్యావాణి, వైస్ ఎంపీపీ రుద్రరాజు చిన్నరాజా, సర్పంచ్ నల్లి విజయ కుమారి, ఎంపీటీసీ సభ్యురాలు అంజలీదేవి, వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాత్రిళ్లు
యథేచ్ఛగా ఇసుక దోపిడీ
అమలాపురం టౌన్: ఉచిత ఇసుక విధానం సక్రమంగా అమలు కావడం లేదని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కొండేటి చిట్టిబాబు, పార్టీ నాయకులు అన్నారు. లోప భూయిష్టంగా జరుగుతున్న ఇసుక పంపిణీపై జాయింట్ కలెక్టర్ టి.నిషాంతికి వారు సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం కలెక్టరేట్ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడారు. పి.గన్నవరం నియోజకవర్గంలో దాదాపు 15 ఇసుక ర్యాంపుల్లోంచి రోజూ రాత్రి వేళ ఇసుకను అక్రమంగా తవ్వేస్తున్నారని చెప్పారు. పీసీసీ ఉపాధ్యక్షుడు కొత్తూరి శ్రీనివాస్, పార్టీ పట్టణ అధ్యక్షుడు వంటెద్దు బాబి, నియోజకవర్గ ఇన్‌చార్జి అయితాబత్తుల సుభాషిణి, పీసీసీ డెలిగేట్ మాచవరపు శివన్నారాయణ, అధికార ప్రతినిధి ముషిణి రామకృష్ణారావు పాల్గొన్నారు.
సమస్యల సత్వర పరిష్కారం
అమలాపురం రూరల్: ప్రతి అర్జీ పైనా ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ గోదావరి భవన్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, డీఆర్‌ఓ మదన్ మోహన్‌రావు, డీఆర్‌డీఏ పీడీ శివశంకర్ ప్రసాద్, డ్వామా పీడీ మధుసూదన్ ప్రజల నుంచి 180 వినతులను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఏరోజుకు ఆరోజే తమ లాగిన్‌కి వచ్చిన అర్జీలను ఓపెన్ చేయాలని, సమస్యను వీలైనంత త్వరగా పరి ష్కరించేందుకు కృషిచేయాలని అధికారులకు సూచించారు. జిల్లాస్థాయి లోనే కాకుండా మండల, మున్సిపల్ డివిజనల్ స్థాయిలోనూ అర్జీల స్వీకరణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసినందున ఈ అవ కాశాన్ని ప్రజలు సద్విని యోగం చేసుకోవాలన్నారు. మండల, మున్సిపాలిటీ స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను మాత్రమే జిల్లా స్థాయి పీజీఆర్ ఎస్‌లో సమర్పించాలని సూచించారు.
పోలీస్ గ్రీవెన్స్‌కు 19 అర్జీలు
అమలాపురం టౌన్: స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 19 అర్జీలు వచ్చాయి. ఎస్పీ బి.కృష్ణారావు నిర్వహించిన ఈ పోలీస్ గ్రీవెన్స్‌కు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి అర్జీదారులు వచ్చి తమ సమస్యలపై ఫిర్యాదు పత్రాలు అందించారు. వచ్చిన 19 అర్జీల్లో సగం వరకూ కుటుంబ తగాదాలు, ఆస్తి వివాదాల ఫిర్యాదులే ఉండడంతో బాధితులతో ఎస్పీ కృషారావు చర్చించారు. అర్జీల పరిష్కారానికి నిర్ణీత గడువు నిర్ధారించాలని ఎస్పీ ఆయా పోలీస్ స్టేషన్ల సీఐలు, ఎస్సైలను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment