గత రబీకి 91.35 టీఎంసీల నీరు అవసరమని సాగునీటిపారుదల శాఖ అధికారులు తేల్చారు. సీలేరు నుంచి 40.49 టీఎంసీలు, పోలవరంలో నిల్వ ఉండే 12 టీఎంసీలు, సహజ జలాలలు 30 టీఎంసీలు కలిపి మొత్తం 82.49 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని తేల్చారు. ఈ విధంగా చూస్తే 8.86 టీఎంసీల నీటి కొరత ఉందన్నారు. పోలవరం పుణ్యమాని రబీసాగు పూర్తయ్యే సమయానికి ఏకంగా 107.6 టీఎంసీల నీరు డెల్టా కాలువలకు విడుదల చేశారు. తూర్పు డెల్టాకు 31.49 టీఎంసీలు, మధ్యడెల్టాకు 20.25, పశ్చిమ డెల్టాకు 55.01 టీఎంసీల చొప్పున విడుదల చేయడంతో రబీ రికార్డు స్థాయిలో పండింది. మొత్తం డెల్టాలో 25 లక్షల మెట్రక్ టన్నులకు పైబడి దిగుబడి వచ్చింది. గతంలో రబీ సాగుకు సీలేరు మీదనే ఆధారపడాల్సి వచ్చేది. సీలేరులో ఆంధ్రా వాటా రబీ సీజన్‌లో 40 నుంచి 45 టీఎంసీలు కాగా, చాలాసార్లు రబీ కోసం 50 నుంచి 60 టీఎంసీలు అదనంగా వాడాల్సి వచ్చేది. కాని గత ఏడాది సీలేరు నుంచి 39 టీఎంసీల విడుదల కాగా రబీ పంట బ్రహ్మాండంగా పండింది.
Comments
Please login to add a commentAdd a comment