అపార్ ఐడీ నమోదు కీలకం
అమలాపురం రూరల్: అపార్ ఐడీ నమోదు విద్యార్థికి అత్యంత కీలకమని పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఎక్కడ చదివింది సులభంగా తెలుస్తుందని కలెక్టర్ ఆర్. మహేష్‌కుమార్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ నుంచి వివిధ మండలాల అధికారులతో వీడియో కాన్ఫరెనన్స్ నిర్వహించి ఉచిత ఇసుక పాలసీ, ధాన్యం సేకరణ, ప్రజా సమస్యల పరిష్కార వేదిక, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలు, రీ సర్వే సరిహద్దు రాళ్ల పై పేర్ల తొలగింపు అర్జీల పరిష్కారం, నరేగా అనుసంధానంతో పల్లె పండగ కార్యక్రమాలు సంక్రాంతి నాటికి పూర్తి చేయాలని సూంచారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలో అపార్ నమోదు నూరు శాతం పూర్తి చేయాలన్నారు అపార్ ఐడీలు జనరేట్ చేసేందుకు అవసరమైన ఆధార్, జనన తేదీ, స్కూల్ సర్టిఫికెట్ల మధ్య వ్యత్యాసాలను సరిదిద్దాలన్నారు. జిల్లాలో ఒకటి నుంచి పదో తరగతి వరకు 83శాతం పూర్తయిందని మిగిలిన ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఈనెల 28 ,29 తేదీలలో తుపాను మూలంగా వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున రైతులు ధాన్యం కోతలు నిలుపుదల చేయాలని సూచించారు. జేసీ టి.నిషాంతి, డీఆర్‌ఓ మదనమోహనరావు పాల్గొన్నారు
మహిళల హక్కులపై అవగాహన అవసరం
మహిళల హక్కులపై అవగాహన అవసరమని డీఆర్‌డీఏ పీడీ డాక్టర్ శివ శంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ గోదావరి భవన్‌లో సీ్త్రల హక్కుల పరి రక్షణ సీ్త్ర హింసా వ్యతిరేక దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. శిశు సంక్షేమ శాఖ పీడీ ఎం.ఝాన్సీరాణి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారిణి పి. జ్యోతిలక్ష్మి దేవి, మెప్మా పీడీ ప్రియం వద, జిల్లా పంచాయతీ అధికారి శాంత లక్ష్మి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీ. ఎస్ మధుసూదన్ వికాస జిల్లా మేనేజర్ రమేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment