వేతనాలు విడుదల చేయాలి
అమలాపురం రూరల్: అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్ వద్ద శానిటేషనన్్ కార్మికులు ధర్నా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూకల బలరాం, కోశాధికారి జి.కృష్ణవేణి, ఉపాధ్యక్షుడు ఎం.భాస్కర్రావు తదితరులు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల శానిటేషన్ వర్కర్లు, వాచ్మెన్లకు 6 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి బకాయి పడ్డ వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్కు అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సత్యవతి, సుశీల, దుర్గాభవాని, గంగా భవాని, సుజాత, మహాలక్ష్మి, సీత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment