హుండీల ద్వారా స్వామికి రూ.39,02,348 ఆదాయం
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో సోమవారం నిర్వహించిన హుండీల లెక్కింపు ద్వారా స్వామికి భక్తుల నుంచి మొత్తం రూ.39,02,348 ఆదాయం వచ్చింది. డిసెంబర్ 6 నుంచి జనవరి 27వ తేదీ వరకూ 53 రోజులకు గాను పై ఆదాయం సమకూరింది. ఎండోమెంట్స్ అమలాపురం తనిఖీదారు జె.రామ లింగేశ్వరరావు పర్యవేక్షణలో లెక్కింపు చేశారు. కాగా మొత్తం ఆదాయంలో మెయిన్ హుండీల ద్వారా రూ.38,29,465, గుర్రాలక్క అమ్మవారి ఆలయ హుండీ ద్వారా రూ.16,780, అన్నదానం హుండీల ద్వారా రూ.56,103 ఆదాయం వచ్చినట్టు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ తెలిపారు. సర్పంచ్ కొండా జాన్‌బాబు, ఎంపీటీసీ బైరా నాగరాజు పాల్గొన్నారు.
రేపు స్పార్స్ అవుట్‌రీచ్
కార్యక్రమం
కాకినాడ సిటీ: మాజీ సైనికులు, మాజీ సైనిక వితంతువులు, మాజీ సైనిక సంఘాల ప్రతినిధులకు బుధవారం స్పార్స్ అవుట్‌రీచ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యాన ఆ రోజు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకూ ఈ కార్యక్రమం రాజమహేంద్రవరం రివర్ బేలో జరుగుతుంది. అలహాబాద్‌కు చెందిన సీడీఏ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సమస్యలు ఎదుర్కొంటున్న ప్రతి మాజీ సైనికులు, వితంతువులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు.
ఆక్నూ పీడీసీఎంఏ
ఉపాధ్యక్షునిగా నాయుడు
అమలాపురం టౌన్: రాజమహేంద్రవరం ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం (అక్నూ)లో ఆ విశ్వ విద్యాలయం అనుబంధ ప్రైవేటు డిగ్రీ కాలేజెస్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (పీడీసీఎంఏ) సాధారణ సమావేశంలో అమలాపురం పట్టణానికి చెందిన ఆకుల బాపన్నాయుడు ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. స్థానిక విద్యానిధి డిగ్రీ కళాశాల డైరెక్టర్ అయిన నాయుడు పీడీసీఎంఏ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కావడం పట్ల ఆక్నూ పరిధిలోని ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు హర్షం వ్యక్తం చేశాయి. ప్రైవేటు డిగ్రీ కళాశాలల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని నాయుడు పేర్కొన్నారు.
ఆక్వా చెరువులపై సర్వే
అమలాపురం రూరల్: తీర ప్రాంత ఆక్వా జోన్, ఆక్వాయేతర జోన్లో ఎంత మేర విస్తీర్ణంలో ఆక్వా చెరువులు ఉన్నది జీయో కోఆర్డినేటర్ల మ్యాపులతో సహా బృందాలు సర్వే చేయాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో మత్స్య అధికారులు, ఆర్డీవోలతో సమావేశం నిర్వహించి ఆక్వా చెరువుల అనుమతుల అంశాలపై సమీక్షించారు. వారంలో సర్వే పూర్తి చేయాలన్నారు.
ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు
ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్, థియరీ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలని జేసీ నిషాంతి కమిటీ సభ్యులకు సూచించారు. సోమవారం ఇంటర్మీడియెట్ బోర్డు ఎగ్జామినేషన్ జిల్లా స్థాయి కమిటీ సమావేశం ఆమె అధ్యక్షతన నిర్వహించారు. జనరల్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 10 నుంచి 20వ తేదీ వరకు, ఒకేషనల్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 5 నుంచి 20వ తేదీ వరకు రెండు సెషన్్స్లో నిర్వహిస్తారన్నారు. ఒక సెషన్ ఉదయం 9 నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు మరొకటి మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహిస్తారన్నారు. జనరల్ ప్రాక్టికల్ కోసం 60 కేంద్రాలు, వోకేషనల్ ప్రాక్టికల్ కోసం 41 కేంద్రాలు కేటాయించి నట్లు తెలిపారు.
వేతనాలు చెల్లించాలని యానిమేటర్ల ధర్నా
అమలాపురం రూరల్: గత ఎనిమిది నెలలుగా బకాయి పడ్డ వేతనాలు వెంటనే చెల్లించాలని కోరుతూ వెలుగు యానిమేటర్ల యూనియన్ రాష్ట్ర వ్యాప్త పిలుపుమేరకు కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో వెలుగు యానిమేటర్ల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఎ.జ్యోతి, సీఐటీయూ కోశాధికారి కృష్ణవేణి మాట్లాడుతూ 8 నెలలుగా వేతనాలు పెండింగ్‌లో ఉంటే యానిమేటర్ల కుటుంబాలను ఎలా నెట్టుకు రావాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వినతి పత్రాన్ని డీఆర్ఓ రాజకుమారికి అందజేశారు. లక్ష్మి, సుబ్బలక్ష్మి, వేణు, విజయ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment