ఆంధ్రప్రదేశ్‌ శకటానికి మూడో స్థానం హర్షణీయం | - | Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్‌ శకటానికి మూడో స్థానం హర్షణీయం

Published Thu, Jan 30 2025 2:29 AM | Last Updated on Thu, Jan 30 2025 2:29 AM

ఆంధ్ర

ఆంధ్రప్రదేశ్‌ శకటానికి మూడో స్థానం హర్షణీయం

అంబాజీపేట: దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో ఈ నెల 26న నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రదర్శించిన ఏటికొప్పాక బొమ్మల శకటానికి మూడో స్థానం దక్కడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. శకటం రూపకల్పనలో కీలకపాత్ర వహించిన రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ పోతుల కిరణ్‌కుమార్‌, అధికారుల బృందానికి, ఏటికొప్పాక కళాకారులకు, వరుసగా మూడోసారి శకటం వద్ద ప్రదర్శన చేసిన ముక్కామలకు చెందిన పసుపులేటి నాగబాబు, అతని బృందానికి గంగలకుర్రు అగ్రహారం శివ కేశవ యూత్‌ బుధవారం అభినందనలు తెలిపింది. ఏటికొప్పాక బొమ్మలతో పాటు, శకటానికి ఇరువైపులా నృత్యం చేసిన కళాకారుల బృందానికి ప్రత్యేకంగా అభినందించింది. ఓటింగ్‌లో పాల్గొని ఆంధ్రప్రదేశ్‌ శకటం మూడో స్థానం పొందేందుకు కృషి చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపింది.

విఘ్నేశ్వరునికి

రూ.1.53 లక్షల ఆదాయం

అయినవిల్లి: పుణ్యక్షేత్రమైన అయినవిల్లి విఘ్నేశ్వర స్వామివారికి బుధవారం ఒక్కరోజు వివిధ పూజా టిక్కెట్లు, ప్రసాదాలు, అన్నదాన విరాళాలు తదితర వాటి ద్వారా రూ.1,52,952 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ, అసిస్టెంట్‌ కమిషనర్‌ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. స్వామివారి ఆలయ ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి పంచామృతాభిషేకాల్లో ఇద్దరు దంపతులు, లఘున్యాస అభిషేకాల్లో 46 మంది దంపతులు, స్వామివారి శ్రీలక్ష్మీ గణపతి హోమంలో 18 మంది దంపతులు, నలుగురు భక్త దంపతులకు స్వామి వేదాశీర్వచనం పలికారు. ఆరు నూతన వాహనాలకు పూజలు చేశారు. స్వామివారి అన్న ప్రసాదాన్ని 1,350 మంది స్వీకరించారు.

31 వరకు ‘టిస్‌’

ఎడిట్‌ ఆప్షన్‌ ఎనేబుల్‌

రాయవరం: టీచర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌(టిస్‌)ను ఎడిట్‌ చేసుకునేందుకు సీఎస్‌ఈ వెబ్‌సైట్‌లో గడువును మరో రెండు రోజులు పొడిగించారు. ఉపాధ్యాయులు ఇప్పటికే టీచర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌లో వారి వివరాలను నమోదు చేసుకున్నారు. ఎవరైనా వారి వివరాలను నమోదు చేసుకోవడంలో పొరపాట్లు చేస్తే, వాటిని సవరించుకోవడానికి సీఎస్‌ఈ వెబ్‌సైట్‌లో టీచర్‌ పర్సనల్‌ లాగిన్‌లో ఎడిట్‌ చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించారు. ఈ అవకాశం మరో రెండు రోజుల పాటు ఉంటుంది. ప్రతి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా వారి పుట్టిన తేదీ, డేట్‌ ఆఫ్‌ ఫస్ట్‌ అపాయింట్‌మెంట్‌, డేట్‌ ఆఫ్‌ జాయినింగ్‌ ఇన్‌ ద ప్రజెంట్‌ క్యాడర్‌, డేట్‌ ఆఫ్‌ జాయినింగ్‌ ఇన్‌ దిస్‌ ప్రజెంట్‌ స్కూల్‌, అకడమిక్‌ అండ్‌ ప్రొఫెషనల్‌ క్వాలిఫికేషన్స్‌ తదితర వివరాలను సర్వీస్‌ రిజిస్టర్‌ ప్రకారం సరిచేసుకోవాల్సి ఉంది. జిల్లాలో ఉన్న 5,400 మంది ఇప్పటికే వారి వివరాలను టిస్‌లో నమోదు చేసుకున్నారు. వివరాలను ఎడిట్‌ చేసుకున్న ఉపాధ్యాయులతో పాటు, అందరు ఉపాధ్యాయులు ఈ నెల 31లోపు కన్ఫర్మేషన్‌ను పూర్తి చేయాల్సి ఉందని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్‌ షేక్‌ సలీం బాషా తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ఆంధ్రప్రదేశ్‌ శకటానికి  మూడో స్థానం హర్షణీయం 1
1/1

ఆంధ్రప్రదేశ్‌ శకటానికి మూడో స్థానం హర్షణీయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement