హోటళ్లపై విజిలెన్స్‌ దాడులు | - | Sakshi
Sakshi News home page

హోటళ్లపై విజిలెన్స్‌ దాడులు

Published Sun, Dec 17 2023 10:34 AM | Last Updated on Sun, Dec 17 2023 10:34 AM

సురుచి ఫుడ్స్‌లో తనిఖీ చేస్తున్న విజిలెన్స్‌ అధికారులు  - Sakshi

సురుచి ఫుడ్స్‌లో తనిఖీ చేస్తున్న విజిలెన్స్‌ అధికారులు

కేసుల నమోదు

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లావ్యాప్తంగా పలు రెస్టారెంట్లు, ఆహార తయారీ కేంద్రాలపై రీజినల్‌ విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు శనివారం దాడులు చేశారు.

ఫ స్థానిక సిటీ హాస్పిటల్‌ రోడ్డులోని సురుచి ఫుడ్స్‌పై దాడి చేసి, కేకులకు ఇస్తున్న బిల్లులపై తూకం లేకపోవడంతో తూనికలు – కొలతల అధికారులు కేసు నమోదు చేశారు. అలాగే, బాదంగీర్‌ బాటిల్స్‌పై తయారీ వివరాలు లేకపోవడం, నాన్‌ స్టాండర్డ్‌ ఎలక్ట్రానిక్‌ వేయింగ్‌ మెషీన్‌ వాడకం, ఆహారం తయారీకి వాడుతున్న వెనిగర్‌, ప్రీమియర్‌ కుకింగ్‌ సేక్‌ బాటిళ్ల స్టాక్‌ గడువు ముగియడంపై మరో మూడు కేసులు నమోదు చేశారు.

ఫ స్థానిక జేఎన్‌ రోడ్డులోని సితార రెస్టారెంట్‌లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల నిల్వలను గుర్తించి కేసు పెట్టారు.

ఫ తాడితోటలోని చందన ఫుడ్స్‌లో ప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌పై తయారీ వివరాలు లేకపోవడంతో 3, నాన్‌ స్టాండర్డ్‌ ఎలక్ట్రానిక్‌ వేయింగ్‌ మెషీన్‌ వాడకంపై 1, గడువు ముగిసిన 5 రకాల ఆహార ఉత్పత్తులను గుర్తించి 1 చొప్పున కేసులు నమోదు చేశారు.

ఫ రెస్టారెంట్లలో ఉపయోగిస్తున్న ఎడిబుల్‌ ఆయిల్స్‌లో టోటల్‌ పోలార్‌ కాంపౌండ్స్‌ మీటర్‌ రీడింగ్‌ 25 శాతం లోపు ఉండాలని, అయితే అంతకు మించి ఉంటున్నాయని రీజినల్‌ విజిలెన్స్‌ ఇన్‌చార్జి ఎస్పీ ఎ.సురేష్‌బాబు తెలిపారు. ఇది ప్రజల ఆరోగ్యానికి హానికరమని, దీనిపై రెస్టారెంట్ల యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని అన్నారు. రెస్టారెంట్లు, బార్ల పరిసరాలు, కిచెన్లు పరిశుభ్రంగా ఉంచాలని, ఫుడ్‌ సేఫ్టీ అధికారుల సూచనల మేరకు రెస్టారెంట్లలో వినియోగదారులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహార పదార్థాలు అందించాలన్నారు. లేకుంటే సంబంధిత రెస్టారెంట్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దాడుల్లో డీఎస్పీ ముత్యాలునాయుడు, కార్యాలయ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరెడ్డి, జియాలజిస్ట్‌ లక్ష్మీనారాయణ, వ్యవసాయ అధికారి భార్గవ మహేష్‌, ఎస్సై జగన్నాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement