ఫ్లషింగ్ ఆపరేషన్ విజయవంతం
ధవళేశ్వరం: వరదల సీజన్ అనంతరం నిర్వహించే ఫ్లషింగ్ ఆపరేషన్‌ను బుధవారం ధవళేశ్వరం తూర్పు డెల్టా స్కవర్ స్లూయిజ్ వద్ద విజయవంతంగా నిర్వహించారు. ఇరిగేషన్ సర్కిల్ ఎస్ఈ జి.శ్రీనివాసరావు బుధవారం ఉదయం గేట్ల స్విచ్ ఆన్ చేసి నీరు విడుదల చేసి ఫ్లషింగ్ ఆపరేషన్‌ను ప్రారంభించారు. దీంతో గేట్ల వద్ద పేరుకుపోయిన మట్టి దిగువకు కొట్టుకుపోయింది. బుధవారం 7,288 క్యూసెక్కుల నీటిని ఫ్లషింగ్ ఆపరేషన్ ద్వారా దిగువకు విడుదల చేశారు. ఎస్ఈ మాట్లాడుతూ రబీ సాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా ఫ్లషింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే పశ్చిమ, మధ్య డెల్టా స్కవర్ స్లూయిజ్‌ల వద్ద ఫ్లషింగ్ ఆపరేషన్ నిర్వహించామని బుధవారం తూర్పు డెల్టా స్కవర్ స్లూయిజ్ వద్ద నిర్వహించిన ఫ్లషింగ్తో ఈ ప్రక్రియ పూర్తి అయ్యిందని వివరించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ హెడ్‌వర్క్స్ ఈఈ ఆర్.కాశీ విశ్వేశ్వరరావు, డీఈ ఆనంద్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment