ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటాం | - | Sakshi
Sakshi News home page

ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటాం

Published Thu, Nov 7 2024 1:15 AM | Last Updated on Thu, Nov 7 2024 1:15 AM

ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటాం

ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటాం

గోపాలపురం: ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటామని, ఎవ్వరూ అధైర్యపడవద్దని రాష్ట్ర మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. గోపాలపురంలోని కూసం రామమోహన్‌రెడ్డి నివాసం వద్ద బుధవారం పార్టీ మండల నాయకులతో మాజీ మంత్రి, గోపాలపురం నియోజకవర్గ ఇన్‌చార్జి తానేటి వనిత అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో దాడులు పెరిగిపోయాయన్నారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పట్టించుకోకుండా వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని అన్నారు. సంక్షేమ పధకాలు అమలు చేయకుండా వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి నాయకులు కార్యకర్తలు నడుం బిగించాలన్నారు. ప్రతిపక్షంలో ఉంచి ప్రజల పక్షాన పోరాటాలు చేయాలన్నారు. తానేటి వనిత మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, ఎవ్వరికి ఏ సమస్య వచ్చినా తన వద్దకు రావాలని సూచించారు. రాజానగం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మాజీ రాష్ట్ర అతిరాస కార్పొరేషన్‌ చైర్మన్‌ ఇళ్ల భాస్కరరావు, ఎంపీపీ వుండవల్లి సత్యనారాయణ, జెడ్పీటీసీ సభ్యురాలు కాకులపాటి లలిత తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement