ఉగాది జాతీయస్థాయి నాటికగా ఇంద్రప్రస్థం | Sakshi
Sakshi News home page

ఉగాది జాతీయస్థాయి నాటికగా ఇంద్రప్రస్థం

Published Sat, May 25 2024 4:00 PM

-

తాడేపల్లిగూడెం (టీఓసీ): తాడేపల్లిగూడెం పట్టణంలోని బీవీఆర్‌ కళాకేంద్రంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి 31వ ఉగాది నాటికల పోటీలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. బీవీఆర్‌ కళా కేంద్రం వ్యవస్థాపక అధ్యక్షులు బుద్దాల వెంకట రామారావు నాటిక పోటీల విజేతల వివరాలను శుక్రవారం వెల్లడించారు. ఉత్తమ ప్రదర్శనగా అభినయ ఆర్ట్స్‌ గుంటూరు వారి ఇంద్రప్రస్థం నాటిక నిలిచింది. ఉత్తమ ద్వితీయ నాటికగా విశాఖపట్నం తెలుగు కళా సమితి వారి నిశబ్ధమా నీ ఖరీదెంత ? ఉత్తమ తృతీయ నాటికగా వెలగలేరు థియేటర్‌ ఆర్ట్స్‌ వారి రాత, జ్యూరీ ప్రదర్శనలుగా హైదరబాద్‌ సిరిమువ్వ కల్చరల్‌ థింక్‌, కొలకలూరు శ్రీ సాయి ఆర్ట్స్‌ వారి కౌసల్యా సుప్రజారామ, ఉత్తమ రచనలుగా ఇంద్రప్రస్థం, స్నిగ్ధ, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ నటుడిగా ఇంద్రప్రస్థం నాటికలో ఎన్‌.రవీంద్రరెడ్డి, ఉత్తమ నటిగా అమృతహస్తంలోని మాలతి పాత్రలోని మాధవి, ద్వితీయ ఉత్తమ నటిగా స్వప్నం రాల్చిన అమృతంలో జ్యోతిరాణిి (సుగుణ), ఉత్తమ ప్రతి నాయకుడిగా అమృతహస్తం నాటికలో ఏపూరి హరిబాబు, ఉత్తమ హాస్య నటుడిగా నిశబ్ధమా నీ ఖరీదెంతలో వామనరవు, (కన్నబాబు), ఉత్తమ బాలనటిగా రాత నాటికలో స్వప్నిక, ఉత్తమ సహాయ నటుడిగా కౌసల్యా సుప్రజారామలో సీతారాం (విజయ్‌), ఉత్తమ సహాయ నటిగా ఇంద్రప్రస్థంలో సౌందర్య పాత్ర జి.నాగ కుసుమసాయి, ఉత్తమ సంగీతం రాతలో సురభి నాగరాజు, ఉత్తమ ఆహార్యం రాతలో శివ ప్రసాద్‌, ఉత్తమ రంగాలంకరణ ఇంద్రప్రస్థంలో ఫణి, ఉత్తమ రంగోద్దీపనంగా కౌసల్యా సుప్రజా రామ, జ్యూరీ అవార్డులు కొత్త తరం కొడుకు శ్రీరామచంద్రయ్య, డి.ఉమాశంకర్‌, రైతే రాజులో రైతు వెంకన్న (భుజంగరావు), న్యాయ నిర్ణేతలుగా ఆకుల మల్లేశ్వరరావు, కత్తుల రామ్మోహన్‌రావు, వి.వేణుగోపాల్‌ వ్యవహరించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement