భీమవరం: ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యల కారణంగా ఏ విద్యార్థికి హాల్‌టికెట్లు నిరాకరించడం, తరగతులకు లేదా ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కాకుండా నిరోధించడం చేయరాదని కళాశాలల యాజమాన్యాలను కలెక్టర్ చదలవాడ నా గరాణి ఆదేశించారు. జిల్లాలో డిగ్రీ, ఇంట ర్మీడియెట్ కళాశాలల యజమాన్యాలు ఇటువంటి చర్యలకు పాల్పడితే ఉపేక్షించబోమ న్నారు. ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం, పరీక్షలకు రానీయకపోవడం వంటివి జరుగుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తే కళాశాలలను బ్లాక్‌లిస్టులో పెడతామని, కఠిన చర్య లు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment