కార్యకర్తలే పార్టీకి కొండంత బలం | - | Sakshi
Sakshi News home page

కార్యకర్తలే పార్టీకి కొండంత బలం

Published Mon, Nov 25 2024 7:59 AM | Last Updated on Mon, Nov 25 2024 7:59 AM

కార్యకర్తలే పార్టీకి కొండంత బలం

కార్యకర్తలే పార్టీకి కొండంత బలం

చింతలపూడి: కార్యకర్తలే పార్టీకి కొండంత బలమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు అన్నారు. ఆదివారం చింతలపూడి వ్యవసాయ మా ర్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ బొడ్డు వెంకటేశ్వరరావు గృహానికి విచ్చేసిన ఆయన్ను పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జె ట్టిని ఘనంగా సత్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో జెట్టి మాట్లాడుతూ గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 40 శాతం ఓట్లు వచ్చిన విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. పార్టీలో చిన్నపాటి విభేదాలు ఉన్నా కార్యకర్తలకు జగన్‌ ఒక్కరే ఏ కై క నాయకుడు అన్నారు. అందరూ సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. కూటమి ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తోందని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎక్కడైనా సోషల్‌ మీడియా యాక్టివిస్టులకు ఇబ్బందులు కలిగితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని, అందరూ అండగా ఉండాలని కో రారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ అసత్య ప్రచారాలు, హామీలను ప్రజలు నమ్మారన్నారు.

కూటమి హామీలపై ఆందోళన

చంద్రబాబు 2014లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, 2024లో ఇచ్చిన హామీలను అమలు చేస్తారో లేదోనని ప్రజలు ఆందోళనలో ఉన్నారని జెట్టి అన్నారు. జగన్‌ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి పథకాల లబ్ధి అందించారన్నారు. వైఎస్సార్‌సీపీని అధికారంలోకి తీసుకురావడం, జగన్‌ను ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులంతా పనిచేయాలని పిలుపునిచ్చారు. మండల పార్టీ అధ్యక్షురాలు జగ్గవరపు జానకిరెడ్డి, ఎంపీపీ బి.రాంబాబు నాయక్‌, పట్టణ కన్వీనర్‌ కొప్పుల నాగేశ్వరరావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి గోలి శరత్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ జ్ఞానారెడ్డి, సర్పంచ్‌లు ఆర్‌వీ రావూరావు, శివరామకృష్ణ, ఎ.వెంకట్రావు, వై రామకృష్ణారావు, త్సల్లాబత్తుల శ్రీనివాసరావు, ఎ.సుబ్బారావు, ఎం.దిలీప్‌, చెంచమరాజు, రామ రాజు నాయక్‌, పేర్రాజు, ఎస్‌.కన్నబాబు, నరసింహారెడ్డి, జోషి, ఆర్‌.వెంకటేశ్వర్రావు, బి.రామారా వు, ఊసా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement