ప్రజావాణిని గట్టిగా వినిపించాం
తణుకు అర్బన్: రాష్ట్ర శాసనమండలి సమావేశాల్లో ప్రజల వాణిని ప్రస్తావించడంలో సఫలీకృతమయ్యామని ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ అన్నారు. తణుకు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడారు. కూటమి మంత్రులు 80 శాతం సమయాన్ని గత ప్రభుత్వంపై విమ ర్శలు చేసేందుకే వినియోగించడం శోచనీయమన్నారు. ముఖ్యంగా పంటల బీమా మొత్తా న్ని గత వైఎస్సార్‌సీపీ ప్రభు త్వం చెల్లించేదని.. అయితే కూటమి ప్రభుత్వం రైతులనే కట్టుకోవాలని చెబుతుండటంపై, కరెంటు చార్జీల సర్దుబాటులో భాగంగా వినియోగదారులపై ట్రూఅప్ పేరుతో భారాన్ని మోపే కార్యాచరణపై, సోషల్ మీడియా వేధింపుల పేరుతో అమాయకులపై కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రెండు గ్రామాలకో డంపింగ్ యార్డు ఏర్పాటుచేయాలని, వసతి గృహాల్లో మెస్ చార్జీలను పెంచాలని, బకాయిలు కూడా చెల్లించాలని డిమాండ్ చేశామన్నారు. గత ప్రభుత్వ హయాంలో కాపు సామాజికవర్గానికి రూ.10 వేల కోట్లపైగా లబ్ధి చేకూరిందని, ప్రస్తుత ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలని కోరామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్సీలకు ప్రొటో కాల్స్ పాటిస్తూ 15 నియోజకవర్గాల్లోనూ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనేలా కార్యాచరణ చేయాలని సూచించామన్నారు.
చిన్న వెంకన్న సేవలో డీజీపీ
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయాన్ని రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదివారం సందర్శించారు. కుటుంబసమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ముందుగా దేవస్థానం అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. డీజీపీ స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితులు ఆయనకు శ్రీవారి శేషవస్త్రాన్ని కప్పి, వేద ఆశీర్వచనాన్ని పలకగా, ఈఓ మూ ర్తి మెమెంటో, ప్రసాదాలను అందజేశారు.
ఘనంగా హనుమద్ కల్యాణం
జంగారెడ్డిగూడెం రూరల్: గురవాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి క్షేత్రంలో కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ఆదివారం సువర్చలా హనుమద్ కల్యాణం నేత్రపర్వంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సోమవారం ఆలయంలో లక్ష తమలపాకులతో పూజలు నిర్వహిస్తామని ఆలయ సహాయ కమిర్ ఆర్‌వీ చందన తెలిపారు.
పెంచిన చార్జీలను
ఉపసంహరించాలి
ఏలూరు (టూటౌన్): రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను ఉపసంహరించుకోవాలని, స్మార్ట్ మీటర్లను ప్రజలు వ్యతిరేకించాలని వామపక్ష పార్టీల జిల్లా సదస్సులో నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక సీపీఎం జిల్లా కార్యాలయంలో సీపీఎం, సీపీఐ, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ తదితర వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కూటమి నాయకులు ఎన్నికలకు ముందు విద్యుత్ చార్జీలు పెంచమని హామీ ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత ప్రజలపై మోపేందుకు సిద్ధమయ్యారని దుయ్యబట్టారు. అలాగే స్మార్ట్‌మీటర్లను బలవంతంగా బిగిస్తున్నారని, దీనిని ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. సీపీఎం నగర కార్యదర్శి పి.కిషోర్, సీపీఐ నగర కార్యదర్శి ఉప్పులూరి హేమశంకర్, సీపీఐ (ఎంఎల్) డెమోక్రసీ నగర కార్యదర్శి బద్దా వెంకట్రావు, సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment